Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య ఫైట్.. ఆ సీటే కారణం

mim focus on nzb mayor, ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య ఫైట్..  ఆ సీటే కారణం

ఇన్నాళ్లు పాతబస్తీకే పతంగి పరిమితమైంది. ఇప్పుడు మరో ప్రాంతానికి ఎగరాలని ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడుప్పుడు నిజామాబాద్‌లో హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ పూర్తిస్తాయిలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ మేయర్ పదవి లక్ష్యంగా పావులు కదుపుతోంది. పతంగి ప్లాన్‌లతో గులాబీ సేనకు దడ పట్టుకుందన్న టాక్ వినిపిస్తోంది.

మునిసిపల్ ఎన్నికల వేళ…నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఓవైసీ నిర్వహించిన సభ పొలిటికల్‌ హీట్‌ను పెంచింది. కేసీఆర్‌తో తాము నడుస్తామని అసద్‌ చేసిన ప్రకటనతో నిజామాబాద్‌లో ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో పది సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్ నగర మేయర్‌ పీఠం దక్కించుకుంది. 16 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకుంది. ఈ సారి కూడా ఇదే వ్యూహాంతో ముందుకు వెళ్తాయని అంతా అనుకున్నారు. అయితే ఎంఐఎం మాత్రం ఈ సారి మేయర్‌ సీటు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఎంఐఎంకు మేయర్‌ సీటు ఇచ్చేందుకు రెడీగా లేరని సమాచారం.

నిజామాబాద్‌ నగర పాలక సంస్థలో తొమ్మిది గ్రామాల విలీనంతో డివిజన్లు 60కి పెరిగాయి. వీటిలో 20 సీట్లలో మైనార్టీల ప్రభావం ఎక్కువ. ఈ డివిజన్లపై ఎంఐఎంతో పాటు టీఆర్‌ఎస్‌ కూడా ఫోకస్‌ పెట్టింది. అయితే నిజామాబాద్‌తో పాటు బోధన్‌లో కూడా ఎంఐఎంతో పొత్తు కీలకం. దీంతో తమకు ఈ సారి మేయర్‌ సీటు వస్తుందనే ఆశలో ఎంఐఎం నేతలు ఉన్నారు. మరోవైపు మేయర్‌ రిజర్వేషన్‌ జనరల్‌ లేదా జనరల్‌ మహిళకు వస్తుందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సారి ఎలాగైనా తమ పార్టీ నేత మేయర్‌ అవుతారని టీఆర్‌ఎస్‌ అంటోంది. మొత్తానికి మేయర్‌ సీటు కోసం ఎంఐంఎం టార్గెట్‌ పెట్టుకోవడం ఇందూరులో చర్చ జరుగుతోంది.

Related Tags