‘ నా ఇండియా టూర్.. వాహ్ ! మోదీ….. యూ ఆర్ గ్రేట్ !’ ఇండియా టూర్ పై ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనపై  ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆ విజిట్ ఎంతో చెప్పుకోదగినదని, అంతటి ఎగ్జైట్ మెంట్ మళ్ళీ రాదని అన్నారు సౌత్ కెరొలినాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. తన టూర్ అనుభవాలను [పదేపదే గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్ లోని మో తేరా స్టేడియంలో లక్షలాది ప్రజలు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో తను పార్టిసిపేట్ చేయడం మరువరానిదని ఆయన అన్నారు. భారత ప్రధాని మోదీతో కలిసి నేను ఆ ఈవెంట్ […]

' నా ఇండియా టూర్.. వాహ్ ! మోదీ.....  యూ ఆర్ గ్రేట్ !'  ఇండియా టూర్ పై ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 01, 2020 | 4:41 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనపై  ఉబ్బితబ్బిబవుతున్నారు. ఆ విజిట్ ఎంతో చెప్పుకోదగినదని, అంతటి ఎగ్జైట్ మెంట్ మళ్ళీ రాదని అన్నారు సౌత్ కెరొలినాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. తన టూర్ అనుభవాలను [పదేపదే గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్ లోని మో తేరా స్టేడియంలో లక్షలాది ప్రజలు హాజరయ్యారని, ఆ కార్యక్రమంలో తను పార్టిసిపేట్ చేయడం మరువరానిదని ఆయన అన్నారు. భారత ప్రధాని మోదీతో కలిసి నేను ఆ ఈవెంట్ లో పాల్గొన్నాను.

అది అద్భుతమైన ఘటన.. అసలు ప్రధాని మోదీని భారత ప్రజలు ఎంతగా అభిమానిస్తున్నారో, ఆరాధిస్తున్నారో తెలుసుకున్నా.. అంటూ.. మోడీని ‘గ్రేట్ గై’ గా అభివర్ణించారు. ఇక్కడ చేరిన జనాలు 140, 50, లేదా 60 వేలు కావచ్చు.. కానీ అహ్మదాబాద్ క్రేజ్ వంటిది నాకు ఎప్పుడూ తారసిల్లలేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ జనాలనే కాదు.. ఆ (అహ్మదాబాద్) జనాలను కూడా అభిమానిస్తున్నా.. వాళ్లకు గొప్ప నాయకుడు ఉన్నాడు. ఈ దేశ ప్రజలను వారు (భారత ప్రజలు) ఎంతో ఇష్ట పడుతున్నారు అని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అది చాలా ‘విలువైన విజిట్’ అని ట్రంప్ మాటిమాటికీ భారత పర్యటనను, మోదీని ఆకాశానికెత్తేశారు. ఈ మధ్యే ట్రంప్ సతీమణి మెలనియా కూడా తన ఇండియా విజిట్ ని, భర్తతో కలిసి తన తాజ్ మహల్ సందర్శనను, ఢిల్లీ స్కూల్లో విద్యార్థులతో తను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్ ద్వారా తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!