ఒకే రోజు మూడు ప్రమాదాలు.. కాకతాళీయమా ?

గురువారం ఒకే రోజు దేశంలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయి వెంకటాపురం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని అనేకమంది అస్వస్థులు అయ్యారు. విషమ స్థితిలో ఉన్న  పదకొండు మంది మరణించగా ఇంకా అనేకమంది కేజీ హెచ్ సహా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనలో చెట్లు మాడిపోగా ..వందల పశువులు కూడా మరణించాయి. అటు ఛత్తీస్ గడ్ రాజధాని రాయ గఢ్ జిల్లాలోని  ఓ […]

ఒకే రోజు మూడు ప్రమాదాలు.. కాకతాళీయమా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 07, 2020 | 7:20 PM

గురువారం ఒకే రోజు దేశంలో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విశాఖలోని ఎల్ జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయి వెంకటాపురం, ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని అనేకమంది అస్వస్థులు అయ్యారు. విషమ స్థితిలో ఉన్న  పదకొండు మంది మరణించగా ఇంకా అనేకమంది కేజీ హెచ్ సహా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటనలో చెట్లు మాడిపోగా ..వందల పశువులు కూడా మరణించాయి. అటు ఛత్తీస్ గడ్ రాజధాని రాయ గఢ్ జిల్లాలోని  ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీకయింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అస్వస్థులయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  అయితే మిల్లు యజమాని ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా దాచిపెట్టాడని తెలిసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. చివరకు మిల్లు యజమానిపై పోలీసులు కేసు పెట్టారు. లాక్ డౌన్ కారణంగా ఈ మిల్లు ఇన్ని రోజులుగా మూత బడి ఉంది.

అటు తమిళనాడులోని కడలూరులో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్లాంట్ లో బాయిలర్ పేలిపోగా ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. ఒకే రోజున ఈ మూడు ప్రమాదాలు జరగడం విశేషం.