Breaking News
  • అమరావతి: సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ. గాయకుడు ఎస్ పి బాల సుబ్రమణ్యం స్మృత్యర్ధం నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. కళాక్షేత్రం అభివృద్ది-ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా జయంతి, జాతీయ పురస్కారం ఏర్పాటు చేయాలి. లలిత కళలకు ప్రోత్సాహం ఇవ్వాలని లేఖలో కోరిన చంద్రబాబు.
  • హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్ . హేమంత్ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్న అవంతి. సందీప్ రెడ్డి గూడూరు, ఆశిష్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటున్న అవంతి . గతంలో హేమంత్ తండ్రితో బెదిరింపులకు దిగిన సందీప్ రెడ్డి . నాతో రెండు లక్షలు డబ్బులు తీసుకున్నాడు అంటూ నెల రోజులు క్రితం బెదిరింపులు . హేమంత్ కిడ్నాప్ అయిన రోజు సందీప్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్న గచ్చి బౌలి పోలీసులు . సందీప్ రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉందంటున్న అవంతి.
  • చెన్నై : ఎస్పీబీ మెమోరియల్ ఫై స్పందించిన ఎస్పీ చరణ్ . నాన్నగారి అభిమానులకోసం అయన స్మారకమందిరాన్ని తప్పకుండ నిర్మిస్తాము . అయన ఎంతో ఇష్టపడే అయన ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తాము . తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్నగారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తాము .
  • తండ్రిని చంపి పాతిపెట్టిన కొడుకు సహకరించిన తల్లి. కన్నకొడుకే తండ్రిని కిరాతకంగా అంతమొందించిన ఘటన . చేవెళ్ల‌ గుండాల గ్రామంలో ఘటన .   నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంగ అసలు విషయం బట్టబయలు . నెల రోజులుగా కనిపించకుండా పోయిన కిష్టయ్య. తల్లితో కలసి తండ్రిని చంపేశానని ,తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించిన కొడుకు . మృతదేహం బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.
  • వివాదాస్పద 3 రైతు బిల్లలకు రాష్ట్రపతి ఆమోదముద్ర. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి చట్టరూపం సంతరించుకున్న బిల్లులు.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.
  • మాజీ కేంద్ర మంత్రి శ్రీ జస్వంత్ సింగ్ అకాల మృతి పట్ల సంతాపం తెలియ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వ భూషణ్ హరిచందన్. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన శ్రీ జస్వంత్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని గవర్నర్ శ్రీ హరిచందన్ తెలిపారు. శ్రీ జస్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సిరీస్ విజయం.. చివరి వన్డేలో ఆసీస్ అద్భుత పోరాటం..

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. 303 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ను..

Maxwell Carey stun England, సిరీస్ విజయం.. చివరి వన్డేలో ఆసీస్ అద్భుత పోరాటం..

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. 303 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌ను.. మ్యాక్స్‌వెల్‌(108), కారే(106)లు సెంచరీతో కదంతొక్కి విజయతీరాలకు చేర్చారు. దీనితో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో దక్కించుకుంది. (Maxwell, Carey stun England)

ఒక దశలో 73/5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును.. వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 212 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక అంతకముందు బెయిర్‌స్టో(112), బిల్లింగ్స్(57), వోక్స్(53) ఆదరగొట్టడంతో ఇంగ్లాండ్ 302/7 స్కోర్ చేయగలిగింది. కాగా, మ్యాక్స్‌వెల్‌ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. అటు గాయం కారణంగా స్టీవ్ స్మిత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Also Read:

బిగ్ బాస్ 4: గంగవ్వను బయటికి పంపే ప్లాన్.. అందుకే టార్గెట్ చేస్తున్నారా.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

Related Tags