IPL 2020 : టాస్ గెలిచిన కేఎల్‌ రాహుల్..

షార్జా వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ స్టార్‌ బ్యాట్స్‌మెన్లు ఉండటంతో భారీ మెరుపులు…

  • Sanjay Kasula
  • Publish Date - 7:18 pm, Mon, 26 October 20

Punjab Win The Toss : షార్జా వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ స్టార్‌ బ్యాట్స్‌మెన్లు ఉండటంతో భారీ మెరుపులు ఉండనున్నాయని అంతా అంచనా వేస్తున్నారు.

సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. షార్జా క్రికెట్ స్టేడియం చిన్నది కావడం…, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కోల్‌కతా నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. రెండు జట్లుకు ఇది కీలకమైన మ్యాచ్‌ అని చెప్పవచ్చు.