తవ్వకాల్లో బయటపడిన డైనోసర్ భారీ తొడ ఎముక..బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

అంతరించిపోయిన డైనోసార్ల జాతి గురించి ఎప్పుడో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట వాటి ఎముకల అవశేషాలు లభించడం..వాటిపై సైంటిష్టులు రిసెర్చ్ చెయ్యడం షరా మాములే. అయితే ఫ్రాన్స్‌లో బయటపడిన ఓ భారీ డైనోసార్ ఎముక వారిలో కొత్త జోష్‌ను తీసుకువచ్చింది. ఆంగియక్ అనే ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా ఇది వెలుగుచూసింది. దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంతంలో పరిశోధకులు అన్వేషిస్తూ శిలాజాలు వెలికితీస్తున్నారు. ప్రస్తుతం బయపడ్డ డైనోసార్ ఎముక 6.6 అడుగుల […]

తవ్వకాల్లో బయటపడిన డైనోసర్ భారీ తొడ ఎముక..బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Follow us

|

Updated on: Jul 27, 2019 | 8:07 PM

అంతరించిపోయిన డైనోసార్ల జాతి గురించి ఎప్పుడో ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట వాటి ఎముకల అవశేషాలు లభించడం..వాటిపై సైంటిష్టులు రిసెర్చ్ చెయ్యడం షరా మాములే. అయితే ఫ్రాన్స్‌లో బయటపడిన ఓ భారీ డైనోసార్ ఎముక వారిలో కొత్త జోష్‌ను తీసుకువచ్చింది. ఆంగియక్ అనే ప్రాంతంలో పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా ఇది వెలుగుచూసింది. దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంతంలో పరిశోధకులు అన్వేషిస్తూ శిలాజాలు వెలికితీస్తున్నారు. ప్రస్తుతం బయపడ్డ డైనోసార్ ఎముక 6.6 అడుగుల (2 మీటర్లు) పొడవు ఉంది. ఇది శాకాహార సారోపాడ్ జాతి డైనోసార్ తొడ ఎముక కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సారోపాడ్‌లు పొడవైన మెడ, తోకతో ఉండేవి. భూమిపై జీవించిన అత్యంత భారీ జంతువుల్లో ఇవి కూడా ఒకటి. ఇప్పటికీ ఆ ఎముక అంత సురక్షితంగా ఉండటం పాలియాంథాలజిస్ట్‌లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ ఎముక బరువు 500 కిలోల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాన్ని ఇంకా వారు నేల నుంచి పూర్తిగా బయటకు తీయలేదు. దాన్ని క్షేమంగా వెలికితీసేందుకు ఓ వారం సమయం పట్టొచ్చని తెలుస్తోంది.