ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే… ఫస్ట్ టార్గెట్ వీళ్లే..

ఉగ్రవాద రహిత దేశంగా భారత్​ను మార్చేందుకు.. కేంద్రం చట్టాలను కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో పాసైన తర్వాత చట్టంగా మారనుంది. ఈ చట్టంతో వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారి ఆస్తులు, ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది. ఈ సవరణలు ఐక్య రాజ్యసమితి ఒడంబడికలు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఈ చట్ట సవరణలకు […]

ఉగ్రవాద నిరోధక చట్టం వస్తే... ఫస్ట్ టార్గెట్ వీళ్లే..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 8:29 AM

ఉగ్రవాద రహిత దేశంగా భారత్​ను మార్చేందుకు.. కేంద్రం చట్టాలను కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక చట్టానికి సవరణలు చేస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో పాసైన తర్వాత చట్టంగా మారనుంది. ఈ చట్టంతో వ్యక్తిగతంగా ఉగ్రవాద ముద్ర వేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అటువంటి వారి ఆస్తులు, ప్రయాణాలపైనా నిషేధం ఉంటుంది. ఈ సవరణలు ఐక్య రాజ్యసమితి ఒడంబడికలు, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఈ చట్ట సవరణలకు ఆమోదం లభించగానే 2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్​, 2001లో పార్లమెంటుపై దాడి, పుల్వామా ఉగ్రదాడిలో నిందితుడు మసూద్ అజార్​లను ఉగ్రవాదులుగా భారత్​ గుర్తిస్తుంది.

చట్టం ఎలా ఉందంటే..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదిస్తే.. ఇక ఉగ్రవాద ముద్రపడినట్లే. అయితే ఉగ్రముద్ర పడ్డ వ్యక్తి.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. 45 రోజుల్లో హోంశాఖకు తెలుపవచ్చు. ఈ అభ్యంతరాలపై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తి, కనీసంగా ఇద్దరు ప్రభుత్వ విశ్రాంత కార్యదర్శులు విచారణ చేపడతారు. ఇక ఒకసారి ఉగ్రవాదిగా ముద్రపడితే ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమిస్తుంది. వీరి వివరాలను ఇతర దేశాల ప్రభుత్వాలతో భారత్​ పంచుకుంటుంది.