Breaking News
  • హైదరాబాద్‌: ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ నేతల యత్నం. సోమాజిగూడలో బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • సూర్యాపేట: మడ్డిరాలలో రిటైర్డ్ అడిషనల్‌ ఎస్పీపై చీటింగ్‌ కేసునమోదు. ఎస్పీ సహా పలువురు రెవెన్యూ అధికారులపై కేసునమదు. వారసత్వ భూమిని సోదరుడికి చెందకుండా అక్రమ పట్టా చేసుకున్నారని ఆరోపణ. తుంగతుర్తి ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు కేసునమోదు. రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, తుంగతుర్తి తహశీల్దార్‌.. ఆర్‌ఐ, వీఆర్వోపై చీటింగ్‌ కేసునమోదు.
  • తిరుమల: నవంబర్‌ నెల రూ.300 దర్శన టికెట్లు విడుదల. టీటీడీ వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదల. రోజుకు 19 వేల టికెట్లను అందుబాటులో ఉంచిన టీటీడీ. ఉ.3 నుంచి రా.11 గంటల వరకు 19 స్లాట్లు. ఒక్కో స్లాట్‌లో వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచిన టీటీడీ.
  • వాషింగ్టన్‌: చంద్రుడిపై అన్వేషణ. సూర్యరశ్మి పడే ప్రాంతంలో కూడా నీటి జాడలు. ఫొటోలు తీసి పంపిన నాసాకు చెందిన సోఫియా టెలిస్కోప్‌. చంద్రుడిపై నీరు పరమాణు రూపంలో ఉన్నట్టు గుర్తింపు. నీరు ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పరిశోధన.
  • చెన్నై : సినీ నటి బిజెపి నేత కుష్బూ అరెస్ట్ . వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ కి వ్యతిరేఖం గా ఆందోళనలకు పిలుపునిచ్చిన బిజెపి. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన తిరుమావళవన్ ని అరెస్ట్ చేయాలనీ చిదంబరం లో బిజెపి ఆందోళనలు . ఆందోళనలకు వెళ్తున్న బిజెపి నేత కుష్బూ ని ఈసీఆర్ రోడ్డు లో అరెస్ట్ చేసిన పోలీసులు.
  • హైదరాబాద్‌: నిమ్స్‌ ఆస్పత్రిలో బెడ్లకు కరువు. రెండు గంటలుగా ఎమర్జెన్సీ వార్డు బయట పేషెంట్ల పడిగాపులు. ఎమర్జెన్సీ కేసులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపుతున్నారని ఆరోపణ.

‘సినిమా చూసేటప్పుడు మాస్క్ తప్పనిసరి’

సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కమల్ జ్ఞాన్‌చందానీ తెలిపారు. తినేటప్పుడు మాత్రం మాస్కులు అవసరం లేదన్న ఆయన..

Masks will be mandatory, ‘సినిమా చూసేటప్పుడు మాస్క్ తప్పనిసరి’

Masks will be mandatory: అన్‌లాక్‌ 5.0లో భాగంగా 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సినిమా థియేటర్లను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని చోట్లా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో మల్టీప్లక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా డైరెక్టర్, పీవీఆర్ సినిమాస్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ మీడియాతో మాట్లాడారు.

”కేంద్రం తీసుకున్న ఈ మూవ్‌ను స్వాగతిస్తున్నాం. థియేటర్ల రీ-ఓపెనింగ్ విషయంపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాం. ప్రస్తుతానికి తమిళనాడు, మహారాష్ట్ర అక్టోబర్ 31 వరకు థియేటర్లు తెరిచే ప్రసక్తి లేదు. నవంబర్ మొదటి వారానికి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నా. ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో థియేటర్లకు అనుమతించిన ప్రభుత్వం.. పరిస్థితుల బట్టి 6-8 వారాల తర్వాత కెపాసిటీపై పునరాలోచన చేస్తామని చెప్పింది” అని కమల్ జ్ఞాన్‌చందానీ పేర్కొన్నారు.

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కమల్ జ్ఞాన్‌చందానీ తెలిపారు. తినేటప్పుడు మాత్రం మాస్కులు అవసరం లేదన్న ఆయన.. ప్రతీ వ్యక్తికి.. వ్యక్తి మధ్య ఖాళీ సీట్లు ఉంటాయన్నారు. కస్టమర్లు టికెట్లతో పాటు ఆహారం, పానీయాలను కొనుగోలు చేసేందుకు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామని అన్నారు. షో టైమింగ్స్ మధ్య చాలా గ్యాప్ ఉంటుందన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా అందరూ పాటించేలా చర్యలు తీసుకుంటామని కమల్ జ్ఞాన్‌చందానీ చెప్పుకొచ్చారు.

Also Read:

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..

Related Tags