లాక్​డౌన్​ తర్వాత ట్రైన్ ఎక్కాలంటే ఇవి తప్పనిసరి…!

కరోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ ఈనెల 14న ముగియనుంది. ఆ త‌ర్వాత కూడా కొనాసాగిస్తారా..లేదా అన్న అంశంపై సస్పెన్స్ నెల‌కుంది. ఒక‌వేళ‌ సేవలు పునరుద్ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విష‌యాల‌పై భారతీయ రైల్వే పోక‌స్ పెట్టింది. రైళ్లలో సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం స‌హా.. థర్మల్​ స్క్రీనింగ్​, మాస్కులు ధరించటం, ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్య యాప్​ ఉప‌యోగించ‌డం వంటి ప్ర‌తిపాద‌న‌లు పరిశీలిస్తోంది. అయితే.. రైల్వే సర్వీసులు ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారు అనే […]

లాక్​డౌన్​ తర్వాత ట్రైన్ ఎక్కాలంటే ఇవి తప్పనిసరి...!
Follow us

|

Updated on: Apr 05, 2020 | 11:42 PM

కరోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌ధాని విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ ఈనెల 14న ముగియనుంది. ఆ త‌ర్వాత కూడా కొనాసాగిస్తారా..లేదా అన్న అంశంపై సస్పెన్స్ నెల‌కుంది. ఒక‌వేళ‌ సేవలు పునరుద్ధరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విష‌యాల‌పై భారతీయ రైల్వే పోక‌స్ పెట్టింది. రైళ్లలో సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం స‌హా.. థర్మల్​ స్క్రీనింగ్​, మాస్కులు ధరించటం, ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్య యాప్​ ఉప‌యోగించ‌డం వంటి ప్ర‌తిపాద‌న‌లు పరిశీలిస్తోంది. అయితే.. రైల్వే సర్వీసులు ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారు అనే అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం రాలేదు.

రాయితీల రద్దు కొనసాగించే అవ‌కాశాలు

అనవసర ప్రయాణాలను అడ్డుక‌ట్ట వేసేందుకు రాయితీలను రద్దు చేస్తూ మార్చి 19న రైల్వే శాఖ ఇచ్చింది. అదే విధంగా లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత ఉత్తర్వులను కొనసాగించే అవకాశం ఉందని రైల్వే వర్గాల నుంచి స‌మాచారం అందుతోంది. విద్యార్థులు, దివ్యాంగులకు ఈ ఉత్తర్వుల నుంచి మిన‌హాయింపు ఉంది. వారికి య‌ధావిధిగా రాయితీ కొనసాగనుందని రైల్వే అధికారులు చెప్తున్నారు.