కరోనా నియంత్రణకు మాస్కులే ముఖ్యం కాదు.. కేంద్రం సూచనలు ఇవే

కరోనా అనగానే మాస్కులు ధరించాలి అన్న అభిప్రాయంలో ఇప్పటికి చాల మంది ఉన్నారు. అందుకే మాస్కుల ధరలు అమాంతం పెంచేసి వినియోగదారుల జేబులకు తూట్లు పొడుస్తున్నారు మెడికల్ షాపుల ఓనర్లు. అయితే మాస్కులు ఎవరు ధరించాలి ? మార్కులు ఎవరికీ అత్యంత అవసరం?

కరోనా నియంత్రణకు మాస్కులే ముఖ్యం కాదు.. కేంద్రం సూచనలు ఇవే
Follow us

|

Updated on: Mar 23, 2020 | 4:42 PM

Masks are not necessary for all: కరోనా అనగానే మాస్కులు ధరించాలి అన్న అభిప్రాయంలో ఇప్పటికి చాల మంది ఉన్నారు. అందుకే మాస్కుల ధరలు అమాంతం పెంచేసి వినియోగదారుల జేబులకు తూట్లు పొడుస్తున్నారు మెడికల్ షాపుల ఓనర్లు. అయితే మాస్కులు ఎవరు ధరించాలి ? మార్కులు ఎవరికీ అత్యంత అవసరం? దీనికి సంబంధించి కేంద్రం నిర్దిష్టమైన ఆదేశాలు, మార్గ దర్శకాలను జారీ చేసిందన్న విషయం ఇప్పటికి చాల మందికి తెలియదు.

కరోనా వైరస్ పేరు విన్నప్పట్నించి మాస్కులకు డిమాండ్ పెరిగిపోయింది. 20 రూపాయలున్న మార్కు ధర ఒక్కసారిగా వంద దాటేసింది. ఇలా రేట్లు పెంచి అమ్ముతున్నారు అన్న విషయం ప్రభుత్వానికి తెలిసే సరికే మెడికల్ షాపుల ఓనర్స్ వేల రూపాయలు ఆర్జించారు. ఆ తర్వాత ప్రభుత్వం హెచ్చరించడంతో కొంత మేరకు ధరలు తగ్గించారు. ఇటీవల ప్రభుత్వం మాస్కులకు, శానిటైజర్లకు ధరలను ఖరారు చేసి ప్రకటించింది.

అయితే మాస్కులు అందరు ధరించాల్సిన అవసరం మాత్రం ఏ మాత్రం లేదంటోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మాస్కులు ధరించాల్సిన అవసరం ఉన్న వారిని మూడు కేటగిరీలుగా విభజించి నోటిఫై చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అందులో మొదటి కేటగిరీ.. (1) కరోనా వ్యాధి పాజిటివ్ గా నిర్ధారించబడిన వారు. రెండో కేటగిరీ.. (2) కరోనా పాజిటివ్ వచ్చిన వారికీ చికిత్సను అందిస్తున్న వారు బీపీసీ కేటగిరీ… (3) కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారు అంటే పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం .. ఈ మూడు లక్షణాలు కనిపించిన వారు అవి ఇతరులకు వ్యాపించకుండా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

కానీ.. చాలా మంది మాస్కు ధరిస్తే ఇతరుల నుంచి కరోనా వైరస్ తమకు సోకదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ . కరోనా వైరస్ తమకు సోకకుండా ఉండాలంటే వైరస్ బెడద పూర్తిగా తొలగిపోయే వరకు సోషల్ గాదరింగ్స్ కి దూరంగా ఉండమని చెబుతోంది. వ్యక్తికీ వ్యక్తి మధ్య దూరం పాటించమంటోంది. సోషల్ డిస్టెన్సింగ్ తో వైరస్ వ్యాప్తి అరికట్టవచ్చని చెబుతోంది. అదే సమయంలో రోజులో కనీసం ఏడెనిమిది సార్లు 20 నుంచి 30 సెకెండ్ల పాటు శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోమంటోంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మాస్కు ధరించడమే వైరస్ వ్యాప్తికి ప్రధాన విరుగుడు అన్న ఉద్దేశంతో కనిపిస్తున్నారు చాల మంది.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??