ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్​ ఉద్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్​(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. గతంలో ఈమె 48 కేజీల విభాగంలో పోటీపడేది. వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​ కోసం తన విభాగం […]

ఈసారి కాంస్యంతో సరి.. మేరీ కోమ్ కు అంపైర్ షాక్ !
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 6:08 PM

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కాంస్యంతోనే సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో పసిడి ఆశలు కల్పించిన ఆమె… రష్యాలోని ఉలాన్​ ఉద్​ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బుసెనాజ్​(టర్కీ) చేతిలో 4-1 తేడాతో పరాజయం చెందింది. 51 కేజీల విభాగంలో పోటీ పడిన మేరీ.. తొలిసారి ఈ విభాగంలో కాంస్యం సాధించింది. గతంలో ఈమె 48 కేజీల విభాగంలో పోటీపడేది. వచ్చే ఏడాది జరగబోయే ఒలింపిక్స్​ కోసం తన విభాగం మార్చుకుంది.

మ్యాచ్​ అనంతరం రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్​ అప్పీల్​ చేసినా… ఫలితం మేరీకి వ్యతిరేకంగానే వచ్చింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఇప్పటివరకు 7 పతకాలు (ఆరు స్వర్ణాలు, ఒక రజతం) గెలిచింది మేరీ కోమ్. ఈ తాజా మ్యాచ్​లో 8వ మెడల్ (కాంస్యం) ఖాతాలో వేసుకుంది.

తాను పరాజయం పొందడంపై తీవ్ర నిరాశకు లోనైన బాక్సర్ మేరీకోమ్ ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజెజులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. తన విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా, కాదా అనే విషయం ప్రపంచానికి తెలియజేయాలని కోరింది.