Breaking News
  • టీవీ9 తో DME డా. రమేష్ రెడ్డి. ప్లాస్మా అనేది సంజీవని కాదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్లాస్మా ట్రీట్ మెంట్ పై ఐసీఎంఆర్ ఇప్పటివరకు ఫైనల్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ మాత్రమే ఇచ్చారు. గాంధీ లో 14 కేసులకు ప్లాస్మా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాము.. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లాస్మా అనేది అవుట్స్టాండింగ్ ట్రీట్మెంట్లో include చేయాలా లేదా అనేది ఐ సి ఎం ఆర్ ఇంకా నిర్ధారించలేదు. ప్లాస్మా డోనర్స్ ముందుకు రావడం మంచి పరిణామం.
  • అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో మార్పులు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ బాధ్య‌త‌ల నుంచి చిన‌వీర‌భ‌ద్రుడుని త‌ప్పించిన ప్ర‌భుత్వం. పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్ గా చిన‌వీర‌భ‌ద్రుడు నియామ‌కం,ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న చిన‌వీర‌భ‌ద్రుడు. స‌మ‌గ్ర‌శిక్షా అభ‌యాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ గా కె,వెట్రిసెల్వి నియామకం. ఇంగ్లీష్ మీడియం అమ‌లు ప్రాజెక్ట్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ గా వెట్రిసెల్వికి పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు.
  • ఏపీలో నూతన ఇండస్ట్రియల్ పాలసీ కి శ్రీకారం. ఇప్పటికే నూతన ఇండస్ట్రియల్ పాలసీ ని ఖరారు చేసిన సర్కార్ . సోమవారం పాలసీని లాంచ్ చేయనున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
  • ఈ ఏడాది సామూహిక నిమజ్జనం ఉండదు. దశల వారీ నిమజ్జనం. ప్రభుత్వానికి సహకరించాలి... కోవిడ్ నిబంధనలు పాటించాలి. ఎత్తు విషయంలో పోటీలకు పోకుండా.. చిన్న మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. -- భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి.
  • కడపజిల్లాలో విషాదం. కమలాపురం మండలం యార్రగుడిపాడు గ్రామంలో అక్కచెల్లెళ్ల ఆత్మహత్యల్లో కొత్త కోణం. ముందురోజు ప్రొద్దుటూరులో తండ్రి బాబురెడ్డి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య. చనిపోయేముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన బాబు రెడ్డి. తన చావుకు అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పిన బాబు రెడ్డి. అల్లుడు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..తనకి న్యాయమూర్తి న్యాయం చేయాలని కోరుతూ సెల్ఫీ వీడియో. తన తండ్రి చావుకు కారణం తన భర్తేనని తెలిసి రైలుకింద పది కుమార్తె స్వేతా రెడ్డి ఆత్మహత్య. అక్క చనిపోయిందని చెల్లెలు ఇంజినీరింగ్ విద్యార్థిని సాయి ఆత్మహత్య. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.
  • మొదలైన హీరో రానా దగ్గుబాటి మిహీక ల వివాహం. వేద మంత్రోచ్ఛారణ మధ్య 8.45 నిమిషాలకు వధువు మిహిక మెడలో తాళి కట్టనున్న వరుడు రానా. రామానాయుడు స్టూడియోలో వివాహ వేడుక . కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. స్టూడియోలో ప్రవేశించడానికి మై గేట్ యాప్ ద్వారా అనుమతి. వివాహ వేడుకలో 30మంది కి మించని కుటుంబ సభ్యులు మరియు నాగచైతన్య, సమంత.

బై నౌ- పే లేటర్..! మారుతి బంపర్ ఆఫర్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది.
Marketing and Sales Buy Now Pay Later Offer, బై నౌ- పే లేటర్..! మారుతి బంపర్ ఆఫర్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎం అండ్‌ ఎం తరహాలో ‘బై నౌ- పే లేటర్ ఆఫర్’ ని ప్రవేశపెట్టింది. ఇందుకుగాను మారుతి సుజుకి సంస్థ చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. దీంతో కారు కొన్నవారు 2 నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు. 2 నెలల వరకు ఈఎంఐ డిఫర్‌మెంట్‌ లభిస్తుంది. సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా మారుతి సుజుకి తెలిపింది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్నవారిని టార్గెట్ చేసుకుని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లుగా మారుతి సుజికి వెల్లడించింది. కొనుగోలుదారులపై వెంటనే అదనపు ఒత్తిడిలేకుండా.. వినియోగదారులను కొనుగోలు వైపుగా ఈ ఆఫర్ ఆకర్షిస్తుందని ప్రకటించింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్‌పైనే ఈ ఆఫర్‌ ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్‌లెట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందని ఆ సంస్థ తెలియజేసింది. ఈ ఆఫర్ జూన్ 30తో ముగుస్తుందని వెల్లడించింది.

Related Tags