Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భారత్ బయోటెక్ ICMR సంయుక్తంగా నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ నిమ్స్ లో ప్రారంభం. ఇవ్వాళ ఆరోగ్య వతమైన వ్యక్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం. క్లినికల్ ట్రైల్స్ లో భాగం కానున్న 60 మంది. ఆరోగ్యంగా ఉండి క్లినికల్ ట్రయల్ కి సమ్మతించిన వారి రక్తనమూనాలను సేకరించి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయనున్న నిమ్స్ ఆస్పత్రి.
  • విజయవాడ: స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. స్వరాజ్ మైదానంలో 20 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు, పార్క్, మెమోరియల్ . ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఏడాదిలో మొత్తం ప్రోజెక్టు పూర్తి చేస్తాం. చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విగ్రహం గ్రాఫిక్ కే పరిమితం చేశారు. ఎక్కడో ఊరికి చివరలో తూతూ మంత్రంగా శంకుస్థాపన చేశారు.
  • రెపటినుండి నిమ్స్ లో ప్రారంభం కానున్న క్లినికల్ ట్రైల్స్. ఏర్పాట్లను పూర్తి చేసిన నిమ్స్ యాజమాన్యం. ఎథిక్స్ కమిటీ అద్వర్యం లో జరగనున్న క్లినికల్ ట్రైల్స్.
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య అత్మహత్య కేసులో నింధితుల అరెస్ట్ . శంషాబాద్ సిఎస్ కె విల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లావణ్య లహరి అత్మహత్య కేసులో నింధితులు మామ సుబ్బారావు ,అత్త రమాదేవి ,అడపడుచులు కృష్ణవేణి లక్ష్మీ కుమారిపై కేసు పమోదు . ప్రకాశం జిల్లా పిసిపల్లి మండలం లో అదుపులోకి తీసుకున్న పోలీసులు . నిందితులను హైదరాబాద్ కు తరలింపు.
  • పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం. అవుటర్ రింగ్ రోడ్డు పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా. హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలు. ఏ పి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో పల్టీ కొట్టిన బొలెరో వాహనం. ప్రమాదం లో గాయపడ్డ వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలింపు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఘటన.

అరుణ గ్రహం పై ‘ ఒయాసిస్ ‘ ! వావ్ ! నాసా న్యూ డిస్కవరీ !

mars curiosity rover finds evidence of an ancient oasis on mars, అరుణ గ్రహం పై  ‘ ఒయాసిస్ ‘ ! వావ్ ! నాసా న్యూ డిస్కవరీ !

అంగారక (మార్స్) గ్రహంపై కనబడుతున్న వింతలు నాసా శాస్త్రజ్ఞులను సంభ్రమాశ్ఛర్యాలకు గురి చేస్తున్నాయి. ఈ గ్రహం పైని ‘ గేల్ క్రేటర్ ” మీద పరిశోధనలు చేస్తున్న ‘ క్యూరియాసిటీ రోవర్ ‘ నిజంగానే క్యూరియాసిటీని పెంచుతోంది. 150 కి. మీ. వైశాల్యంతో కూడిన ఈ కొండలాంటి అడుగు భాగాన.. బహుశా కోట్ల ఏళ్ళ నాటి ‘ ఒయాసిస్ ‘ ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. రోవర్ నుంచి అందిన డేటాను విశ్లేషిస్తున్న రీసెర్చర్లు.. ఈ క్రేటర్ కిందిభాగంలో అత్యంత పురాతనమైన.. మూడువందల కోట్ల ఏళ్ళ క్రితం ఒక ఒయాసిస్ ఉండేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ ఉప్పు ఖనిజాలతో కూడిన చిన్నపాటి జల చెలమలు ఉండేవని, కాల క్రమేణా అవి ఎండిపోతూ వచ్చాయని వీరు… ‘ నేచర్ జియో సైన్స్ ‘ అనే మ్యాగజైన్ లో రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. మార్స్ పైని వాతావరణం మొదట్లో తడిగా ఉండేదని, ఆ తర్వాత క్రమేపీ చల్లని ఐస్ క్లైమేట్ తో ‘ ఎడారి ‘ ప్రాంతంలా మారిందని వారు తెలిపారు.


కాలిఫోర్నియాలోని పసడేనాలో గల’ జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ ‘ లో ఈ శాస్త్రజ్ఞులు అంగారక గ్రహానికి సంబంధించిన విశేషాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మహా క్రేటర్ గాలి, నీటితో నిండిపోయింది. అనంతరం కోట్లాది సంవత్సరాలుగా అది గట్టిపడుతూ శిలా రూపంగా, కొండ ప్రాంతంగా మారుతూ వచ్చింది. ఫలితంగా ‘ మౌంట్ షార్ప్ ‘ అనే అనే జియాలాజికల్ ఫార్మేషన్ (కొండవంటి ప్రాంతం) ఏర్పడింది. దాన్నే క్యూరియాసిటీ రోవర్ అధిరోహిస్తోంది అని లీడ్ ఆథర్ అయిన విలియం రాపిన్ వెల్లడించారు. అక్కడి ప్రతి నమూనానూ,. లేయర్ నూ రోవర్ సేకరిస్తోందని, మార్స్ ని మార్చేస్తున్న గేల్ క్రేటర్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.
2017 లో తొలుత రోవర్ ఈ క్రేటర్ మీద ‘ అడుగు పెట్టినప్పుడు ‘.. 500 అడుగుల పొడవైన శిలా ఖండాలను కనుగొన్నట్టు ఆయన చెప్పారు. అక్కడి జియాలాజికల్ ఫార్మేషన్స్.లో కొన్ని.. . సౌత్ అమెరికా ఆల్టిప్లానో లోని ఉప్పునీటి సరస్సులను పోలి ఉన్నట్టు విలియం అభిప్రాయపడ్డారు.

Related Tags