బెండకాయ కూర తెచ్చిన తంటా.. ఆత్మహత్య చేసుకున్న భార్య

Married woman suicide at kukatpally, బెండకాయ కూర తెచ్చిన తంటా.. ఆత్మహత్య చేసుకున్న భార్య

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వండిన కూర సరిగాలేదని భర్త కోప్పడడంతో భార్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విచారానికి గురిచేసింది. ఎల్ఐజీ వెంచర్‌లో నివసించే మనీష్, శారద దంపతులు.. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శారద ఇంట్లో బెండకాయ కూర వండింది.

అయితే వాడిపోయిన బెండకాయలతో కూర చేశావంటూ భర్త మనీష్ గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న వస్తువులపై ప్రతాపం చూపడంతో… దాన్ని శారద అవమానంగా భావించింది. దీంతో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటికి వచ్చి చూసే సరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *