Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

రానా Weds మిహీకా.. డేట్ ఫిక్స్‌..!

దగ్గుబాటి వారసుడు రానా త్వరలో తన బ్యాచులర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పబోతున్న విషయం తెలిసిందే. తాను ప్రేమించిన మిహీకా బజాబ్‌ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు.
Rana Daggubati marriage date, రానా Weds మిహీకా.. డేట్ ఫిక్స్‌..!

దగ్గుబాటి వారసుడు రానా త్వరలో తన బ్యాచులర్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పబోతున్న విషయం తెలిసిందే. తాను ప్రేమించిన మిహీకా బజాబ్‌ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం రానా-మిహీకాల పెళ్లి డేట్ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ఆగష్టు 8న వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్‌ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. ప్రభుత్వ నిబంధనలను అనుగుణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

కాగా వీరిద్దరి వివాహం డిసెంబర్‌లో జరగనున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరికి సరిపోయేలా డిసెంబర్‌లో ముహూర్తాలు లేకపోవడం, ఆగష్టులో ఉండటంతో ఆ రోజునే ఫిక్స్‌ చేసినట్లు టాక్‌ నడుస్తోంది. కాగా ఇటీవల మంచు లక్ష్మీతో ఇన్‌స్టా లైవ్‌ చాటింగ్‌లో పాల్గొన్న రానా తన ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ ”రోకా వేడుకకు పిలవలేదు. కనీసం పెళ్లికైనా నీ స్నేహితులను పిలుస్తావా..?” అంటూ ప్రశ్నించింది. దానికి రానా.. ”అప్పటి పరిస్థితులను బట్టి పిలుస్తా. ఒకవేళ ఇప్పటిలాగే అప్పుడూ పరిస్థితులు ఉంటే నేను ఫొటోలను పంపుతా. మీరు చూడండి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీవు కదా” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. కాగా వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత ద్వారా రానా, మిహీకాల మధ్య పరిచయం ఏర్పడింది. వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారడంతో.. త్వరలో మరో అడుగు ముందుకేసి తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు.

Read This Story Also: ఆంధ్ర సరిహద్దుల్లో మిడతల దండు.. ఆందోళనలో రైతులు..!

Related Tags