భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

Market Live: Nifty below 10900 and Sensex falls 400 pts, భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కట్లు మంగళవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.26 గంటల సమయంలో సెన్సెక్స్ 399.96 పాయింట్లు నష్టపోయి 36,932.83 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అదే సమయంలో నిఫ్టీ 129.9 పాయింట్లు నష్టపోయి 10,893.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మొన్న శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగుగా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 18 నుంచి 12కు పడిపోయింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఆటోమొబైల్‌ విక్రయలు కూడా పడిపోయినట్లు నివేదికలు రావడంతో ఆ రంగం షేర్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి.

మార్కెట్ ప్రారంభంలో 267 కంపెనీల షేర్లు లాభంలో ట్రేడ్ అవుతుండగా.. 523 కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 57 కంపెనీల షేర్లు మాత్రం తటస్థంగా ఉన్నాయి. సీజీ పవర్, పవర్ గ్రిడ్, కేఎన్ఆర్ కన్స్‌ట్రక్షన్స్, దిలీప్ బుల్డ్‌కాన్, సిండికేట్ బ్యాంక్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్ టెక్ హీరో కార్పోరేషన్, లాభాల్లో ఉన్నాయి. ఇక ఐఓసీ, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐచర్ మోటర్స్, ఓబీసీ, కెనెరా బ్యాంక్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *