లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 160, నిఫ్టీ 70 పాయింట్లు

Market Live: Nifty above 10850 Sensex up 100 pts, లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 160, నిఫ్టీ 70 పాయింట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.31 గంటలకు సెన్సెక్స్ 160.66 పాయింట్లు లాభపడి 36885.40 వద్ద ట్రేడ్ అవుతుండగా.. అదే సమయంలో నిఫ్టీ 70.25 పాయింట్ల లాభంతో 10914.90 వద్ద కొనసాగుతోంది. మార్కెట్ ఓపెనింగ్ సమయంలో 429 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. 140 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మరో 29 కంపెనీల షేర్లు తటస్థంగా కొనసాగుతున్నాయి. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో రూ.71.95గా ఉంది.

వేదాంతా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ, ఓఎన్జీసీ, ఎన్‌టీపీపీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐవోసీ, ఎమ్అండ్‌ఎమ్‌ లాభాల్లో ఉండగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బీపీసీఎల్‌, మారుతి సుజుకి, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల్లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *