Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 38 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 138845. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 77103. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 57721. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4021. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లకు రూ. 5 వేల చొప్పున వన్‌టైం సహాయం. రేపు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి అకౌంట్లలో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.
  • టీవీ 9 తో జీఎంఆర్ సీఈవో కిషోర్: ఈరోజు నుండి ఇతర రాష్టాలకు వెళ్లే డేమోస్ట్రిక్ ఫ్లయిట్స్ ప్రారంభం కావడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఈరోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి 20 ఫ్లయిట్స్ ఇతర రాష్టాలకు వెళ్తున్నాయి. దాదాపు 20 ఫ్లయిట్స్ ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ వస్తున్నాయి. ప్రతి ఒక్క ప్రయాణికుడు మాస్క్ లు, షానిటైజేషన్ తప్పని సరి. 3వేల మంది ప్రయాణికులు ఈరోజు ప్రయాణిస్తున్నారు. కరోనాలక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని మాత్రమేక్వారెంటాయిన్ లకు పంపిస్తున్నాం. కరోనా లక్షణాలు లేని వారికి క్వారెంటాయిన్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేత్ యాప్ కచ్చితంగా ఉండాలి.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • వాట్సప్ ద్వారా అసభ్యకర మెసేజీలు పంపుతున్నాడు అని ట్రాఫిక్ హోంగార్డు పై షీ టీమ్ కు ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు లాక్‌డౌన్‌ సమయములో ట్రాఫిక్ హోంగార్డు వెంకటేష్ . కొద్దిరోజుల తర్వాత వాయిస్ మెసేజ్ లు పంపించడం మొదలు పెట్టిన హోంగార్డ్ వెంకటేష్ . వేధింపులు తట్టుకోలేక మహిళ డాక్టర్ షీ టీం పోలీసులకు ఫిర్యాదు . మహిళా డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన సీపీ అంజనీ కుమార్ . హోంగార్డు వెంకటేష్ ను సస్పెండ్ చేసిన సిపిఐ అంజనీ కుమార్.
  • కరోనా తెలంగాణా బులిటిన్ ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు ఇవ్వాళ నలుగురు మృతి మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.. ఇవ్వాళ 24 మంది డిశ్చార్జ్ కాగా మొత్తం 1092 మంది డిశ్చార్జ్ అయ్యారు..

‘మార్చి’ పేరు చెబితేనే ఇట‌లీ వెన్నులో వ‌ణుకు..ప్ర‌పంచ దేశాల‌కూ ఓ పీడ క‌ల‌

corona impact in italy, ‘మార్చి’ పేరు చెబితేనే ఇట‌లీ వెన్నులో వ‌ణుకు..ప్ర‌పంచ దేశాల‌కూ ఓ పీడ క‌ల‌

క‌రోనా వైర‌స్ ఇటలీని శ‌వాల దిబ్బ‌గా మార్చేసింది. రోజుకు వేల సంఖ్య‌లో ప్రాణాలు పోతుంటే ఏం చేయ‌లేకపోతుంది ఆ దేశం. పుట్టిన చైనా కంటే ఇట‌లీకే ఎక్కువ డ్యామేజ్ చేసింది కరోనా వైర‌స్. మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుట్టేలా.. క‌రోనా మ‌హమ్మారి అక్క‌డ మ‌నుషుల ప్రాణాల్ని చిదిమేస్తుంది. ఇప్ప‌టికి అక్క‌డ‌ 12,428 మంది కొవిడ్‌-19తో చనిపోయారు. ప్రాణాలు విడిచినవారి స్మారకార్థం మంగళవారం ఇటలీ.. జాతీయ పతాకాలను అవనతం చేసి…మౌనం పాటించింది. సెకండ్ వ‌రల్డ్ వార్ తర్వాత ఆ దేశంలో ఇంత‌మంది ప్రాణాలు పోగొట్టుకోవ‌డం ఇదే మొద‌టిసారి.

ఫిబ్రవరి చివరి వారంలో ఇట‌లీలోని మిలన్‌లో తొలి కరోనా కేసు న‌మోదైంది. ఆ తర్వాత ఈ వైరస్‌ దేశంలోని ప్ర‌తి మూల‌కు విస్త‌రించింది. గ‌త‌ మూడు వారాలుగా అక్కడ లాక్‌డౌన్ అమ‌లవుతోంది. దాదాపు లక్ష మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. మ‌రోవైపు కోవిడ్ ఆ దేశాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసింది. ఐరోపా కూటమిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీ ప‌రిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే. ఏప్రిల్ మిడిల్ వ‌ర‌కు లాక్ డౌన్ కొనసాగుతుంద‌ని అక్క‌డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఏది ఏమైనా ప్ర‌పంచ దేశాల‌కు మార్చి నెల ఓ మ‌రుపురాని పీడ‌క‌ల‌గా మిగిలిపోతుంది. కానీ ఇట‌లీకి మాత్రం మార్చి నెల పేరు చెబితేనే వెన్నులో వ‌ణుకు పుట్టే విధంగా క‌రోనా ఆ దేశాన్ని పీడిస్తుంది.

Related Tags