మరోసారి అలా మాట్లాడితే ఊరుకునేది లేదు, పవార్‌కు యడియూరప్ప వార్నింగ్‌

ర్నాటకలోని బెల్గాంతో పాటు మరికొన్ని ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకుంటామంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక సీఎం యడియూరప్ప..

  • Balu
  • Publish Date - 5:12 pm, Wed, 18 November 20

కర్నాటకలోని బెల్గాంతో పాటు మరికొన్ని ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలుపుకుంటామంటూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక సీఎం యడియూరప్ప మండిపడ్డారు. అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలు అర్థరహితమని, రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పుట్టించేలా ఉన్నాయని అన్నారు. వివాదాలు సృష్టించే ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ చేయవద్దంటూ అజిత్‌ పవార్‌ను హెచ్చరించారు. ఇక్కడ మరాఠీ మాట్లాడేవారు కూడా కన్నడీగులేనని స్పష్టం చేశారు. మరాఠాల సంక్షేమం కోసం మరాఠ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తామన్నారు యడియూరప్ప. ఈ విషయంలో మహాజన్‌ కమిటీ ఇచ్చే నివేదికనే ఫైనల్‌ అన్ని అన్నారు. మరాఠాలు బలమైన హిందుత్వవాదులని, త్వరలో బెల్గాంలో నిర్వహించే విశ్వ కన్నడ సమ్మేళనంలో వారు కూడా పాల్గొంటారని తెలిపారు కర్నాకట సీఎం. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బెల్గాంలో కాకుండా బెంగళూరులోనే నిర్వహిస్తామని తెలిపారు.. కర్నాటక-మహారాష్ట్రల మధ్య దశాబ్దాలుగా సరిహద్దు సమస్యలు ఉన్నాయి.. బెల్గాం, కార్వార్‌, నిపాని జిల్లాలపై రెండు రాష్ట్రాలు గొడవలు పడుతున్నాయి..