గణపతి లొంగుబాటుపై స్పందించిన మావోయిస్టు కేంద్ర కమిటీ

మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్‌పై మావోయిస్టు కేంద్రకమిటీ స్పందించింది. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు హైటెన్షన్‌ కల్పిత కథ అని తేల్చిచెప్పింది. ఇదంతా కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఇంటలిజెన్స్‌ సంస్థల కట్టుకథ అని..

గణపతి లొంగుబాటుపై స్పందించిన మావోయిస్టు కేంద్ర కమిటీ
Follow us

|

Updated on: Sep 03, 2020 | 6:51 PM

మావోయిస్టు అగ్రనేత గణపతి సరెండర్‌పై మావోయిస్టు కేంద్రకమిటీ స్పందించింది. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు హైటెన్షన్‌ కల్పిత కథ అని తేల్చిచెప్పింది. ఇదంతా కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఇంటలిజెన్స్‌ సంస్థల కట్టుకథ అని.. కేంద్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ ఓ ప్రతికా ప్రకటనను విడుదల చేశారు.

BJP పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతన మైందని మావోయిస్టుపార్టీ కేంద్రకమిటీ ఆరోపించింది. గణపతి అనారోగ్య సమస్యలతో పదవినుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారన్నారు అభయ్‌. ప్రపంచ పోరాట చరిత్రల్లో నాయకత్వ మార్పు సహజమన్నారు. సిద్ధాంతపరంగా, రాజకీయపరంగా మా నాయకత్వం పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు.  మావోయిస్టుపార్టీ నాయకత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం జరుగుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.