దిశ కేసు నిందితులు ఎన్‌కౌంటర్..అష్ట దిగ్బంధంలో పోలీసులు

దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాదులపై ఎటువంటి ఆగ్రహావేశాలు చెలరేగాయో చెప్పాల్సిన పనిలేదు. నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యాలని, నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నినదించారు. కాగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోయే ప్రయత్నం చేయడంతో..ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు నిందితులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ఇక్కడివరకు బాగానే ఉంది. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసుల చుట్టూ […]

దిశ కేసు నిందితులు ఎన్‌కౌంటర్..అష్ట దిగ్బంధంలో పోలీసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 2:41 PM

దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాదులపై ఎటువంటి ఆగ్రహావేశాలు చెలరేగాయో చెప్పాల్సిన పనిలేదు. నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యాలని, నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నినదించారు. కాగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోయే ప్రయత్నం చేయడంతో..ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు నిందితులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు. ఇక్కడివరకు బాగానే ఉంది. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పలువురు ప్రజా సంఘాల నేతలు, మహిళా సంఘాల వాళ్లు దిశ నిందితులది ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ ఆరోపిస్తున్నారు.

అంతేనా దీనిపై పలువురు హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసును స్వీకరించింది. తాజాగా ఎన్‌కౌంటర్‌పై రాష్ట్రేతర పోలీసులతో విచారణ జరిపించాలని ఓయూ మాజీ ప్రొఫెసర్ రామ్ శంకర్ నారాయణ్ హై కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు.  ఎన్‌కౌంటర్‌పై పోలీసులు సుప్రీం కోర్ట్ గైడెలైన్స్ పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నాడు.

ఇక పౌర హక్కుల సంఘము అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా  హై కోర్టులో ఎన్‌కౌంటర్‌పై పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్ బూటకం అని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై 302 కేసులు నమోదు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇక నాలుగు మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరిన మరో పిటీషన్ దాఖలైంది. పిటీషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్,సిట్ కమిషనర్ మహేష్ భగవత్,షాద్ నగర్,శంషాబాద్, ఎస్‌హెచ్‌ఓ లతో కలిపి మొత్తం 9 మందిని పిటీషనర్ ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాగా మరోవైపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..