మౌనం వీడిన ముని.. మోదీ రియాక్టవుతారా..?

Former MP Manmohan quits silence, మౌనం వీడిన ముని.. మోదీ రియాక్టవుతారా..?

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 87సంవత్సరాలు వచ్చాక యాక్టివ్ అయ్యారు. ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లిన ఆయన అప్పటి నుంచి తన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. మొదటిసారిగా 1991లో రాజ్యసభకు వెళ్లి.. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్. అప్పటినుంచి పార్లమెంట్‌‌లో ఉన్నా బయట మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటూ వస్తున్నారు. ఈ నిశ్శబ్దానికి మౌన మనిషి అనే విమర్శలు కూడా వినిపించాయి. ప్రధానిగా రెండు దఫాలు పనిచేసినా.. పార్లమెంట్‌లోనూ, బయటా ఆయన మాట్లాడింది చాలా తక్కువ. అందుకే ఆయన మీద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని మౌన ప్రధాని అని సెటైరిక్‌గా పిలుచుకునేవారు.

కానీ గత రెండు నెలల్లో చాలా యాక్టివ్ అయిపోయిన మన్మోహన్ సింగ్.. మోదీ ప్రభుత్వానికి ఎఫెక్టివ్‌ అపోజిషన్‌గా మారారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న విమర్శలు.. ప్రజల్లోకి బాగా చొచ్చుకు వెళుతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ముంబయిలో ఓ సమావేశంలో మాట్లాడిన మన్మోహన్ సింగ్.. ఐదున్నర్ర సంవత్సరాల మోదీ పాలనపై మాట్లాడారు.

Former MP Manmohan quits silence, మౌనం వీడిన ముని.. మోదీ రియాక్టవుతారా..?

అస్తమానం విపక్షాలపై నిందలు వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేరని ఆయన హితవు పలికారు. విపక్షాలపై నిందలు వేసే బదులు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషించాలంటూ ఆయన సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లకు అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. దీన స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను సరిచేయకుండా సమయాన్ని వృదా చేస్తున్నారంటూ మన్మోహన్ ఘాటు విమర్శలు చేశారు.

అయితే ఈ విమర్శలకు ఇంకా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దీని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలిగారంటే అది మన్మోహన్ సింగ్ మాత్రమేనని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే మిగిలిన ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మాట్లాడినా.. వారి మీద ఏదో ఆరోపణలు ఉన్నాయి. కానీ తన హయాంలో ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వర్తించి మ్యాన్ ఆఫ్ హానెస్టీగా పేరును సంపాదించారు కాబట్టి.. ఆయన విమర్శలు ప్రజల్లోకి వెళ్తూ.. ప్రభావాన్ని చూపుతున్నాయి. మొత్తానికి ఈ ముని మౌనం వీడగా.. ఆయనను ఎదుర్కోవడం బీజేపీకి పెద్ద సవాలుగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదేమో.!

Former MP Manmohan quits silence, మౌనం వీడిన ముని.. మోదీ రియాక్టవుతారా..?

Disclaimer: ఈ ఆర్టికల్‌లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి. అవి టివీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించవద్దని మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *