Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

గురువు మిస్సయ్యాడు.. ఏం చేద్దాం శిష్యుడే చాలంటున్న జగన్

discussion on intelligence chief, గురువు మిస్సయ్యాడు.. ఏం చేద్దాం శిష్యుడే చాలంటున్న జగన్

అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి.. అనేది మనం తరచూ వినే నానుడి. మనమొకటి తలిస్తే.. దైవమొకటి తలవడమనేది సహజం. మనం ఆశించింది జరగనపుడు ఎవరమైనా ఇలా అనుకునే వాళ్ళమే. కానీ మనలో ఎంత మంది అనుకున్నది దక్కకపోయినా.. దక్కిన దానితో సంతృప్తి పడే వాళ్ళున్నారు? సరిగ్గా ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో మరీ ముఖ్యంగా రాజధాని అమరావతిలోను, ఇటు హైదరాబాద్ పోలీసు వర్గాల్లోను జరుగుతోంది.

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తెలంగాణ క్యాడర్‌లో వున్న స్టీఫెన్ రవీంద్రను నియమించుకోవాలని అనుకున్నారు. ఆ మేరకు కెసీఆర్‌ను ఒప్పించి అంతరాష్ట్ర డిప్యూటేషన్‌కు రవీంద్రతో అప్లై కూడా చేయించారు. కానీ, కేంద్రం అందుకు అంగీకరించలేదు. దాంతో స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ క్యాడర్‌లోనే వుండిపోయారు.

ఏపీలో ఏబి వెంకటేశ్వరరావును ఐబి చీఫ్‌గా ముఖ్యమంత్రి జగన్ నియమించుకున్నారు. అయితే.. ఇటీవల స్టీఫెన్ రవీంద్ర అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. దాంతో కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ ఎంపీ ఒకరు తీవ్రస్థాయిలో విఫల యత్నం చేసినట్లు సమాచారం. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్‌కు కేంద్రం ససేమిరా అనడంతో ఇక వేరే దారి లేక.. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రకు అత్యంత సన్నిహితుడు, ఆయన బ్యాచ్ మేట్ అయిన మనీశ్ కుమార్ సిన్హాను జగన్ నియమించుకున్నారు. వీరిద్దరు ఒకే సమయంలో హైదరాబాద్‌లో డిసిపిలుగా పనిచేశారు.

మనీశ్, స్టీఫెన్ రవీంద్ర మధ్య అత్యంత సాన్నిహిత్యం వుందని, రవీంద్ర సూచన మేరకే జగన్ మనీశ్‌ను ఎంపిక చేసుకున్నారని పోలీసు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరి ఇంటలిజెన్స్‌ స్టయిల్ సేమ్ అని వారి గురించి తెలిసిన పోలీసులు చెప్పుకుంటున్నారు. సో.. గురువు స్టీఫెన్ రవీంద్ర కాకపోయినా.. ఆయన శిష్యుడు మనీశ్ వైపు జగన్ మొగ్గుచూపారని ఛలోక్తులు విసురుతున్నారు పోలీసు అధికారులు కొందరు.