ఇంటి దారి పట్టిన 185 మంది నర్సులు.. !

కరోనా యోధులు కొలువులు వదలుకుంటున్నారు. విపక్షతకు గురవుతున్నామంటూ ఉద్యోగాలు వదిలేసి సొంతూర్లకు పయనమయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న మణిపూర్ కి చెందిన నర్సులు తమ ఉద్యోగాలు వదులుకుంటున్నారు. దాదాపు 185 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఇంఫాల్‌లోని క్రిస్టెల్లాకు తిరిగి వెళ్లారు. రోజు రోజుకి కరోనా రక్కసి విరుచుకుపడుతున్న సమయంలో నర్సులు ఇలా వెళ్లడం బాధగా ఉందంటున్నారు వైద్య సిబ్బంది. కోల్‌కతా ఆస్పత్రుల్లో మూడు […]

ఇంటి దారి పట్టిన 185 మంది నర్సులు.. !
Follow us

|

Updated on: May 20, 2020 | 7:44 PM

కరోనా యోధులు కొలువులు వదలుకుంటున్నారు. విపక్షతకు గురవుతున్నామంటూ ఉద్యోగాలు వదిలేసి సొంతూర్లకు పయనమయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న మణిపూర్ కి చెందిన నర్సులు తమ ఉద్యోగాలు వదులుకుంటున్నారు. దాదాపు 185 మంది నర్సులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఇంఫాల్‌లోని క్రిస్టెల్లాకు తిరిగి వెళ్లారు. రోజు రోజుకి కరోనా రక్కసి విరుచుకుపడుతున్న సమయంలో నర్సులు ఇలా వెళ్లడం బాధగా ఉందంటున్నారు వైద్య సిబ్బంది. కోల్‌కతా ఆస్పత్రుల్లో మూడు వేలకి పైగా మణిపూర్ చెందిన నర్సులుగా పనిచేస్తున్నారు. కోల్‌కతా ఆరోగ్య సంరక్షణకు ముఖ్యంగా కొవిడ్ 19 బాధితులకు సేవలందిస్తున్నారు. వారి అదరించడంలో గానీ, కనీస వసతులు కల్పించడంలో విపక్షత చూపుతున్నారంటూ సొంతూర్లకి పయనమయ్యారు. తాము ఉద్యోగాలు వదులుకుంటున్నందుకు బాధగా ఉందని.. కానీ విధులు నిర్వర్తించే సమయంలో మాపట్ల చాలా వివక్ష చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నర్సులు. కొంతమంది అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కరోనా కేసులు పెరుగుతుండగా..పీపీఈ కిట్స్‌ సరిపడా లేకపోవడంతో చాలా మంది ప్రజలు, రోగులు మమ్మల్ని ప్రశ్నిస్తున్నరన్నారు. కొందరైతే మొఖంపై ఉమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయిందన్నారు.