మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం.. గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన ఏసీపీ

మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తప్పుగా తీర్పు ఇచ్చిందంటూ తనకి ప్రభుత్వం ఇచ్చిన బహుమానాన్ని తిరిగి అప్పగించేశారు.

మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం.. గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చిన ఏసీపీ
Follow us

|

Updated on: Dec 20, 2020 | 8:49 PM

మణిపూర్ పోలీసు ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తప్పుగా తీర్పు ఇచ్చిందంటూ తనకి ప్రభుత్వం ఇచ్చిన బహుమానాన్ని తిరిగి అప్పగించేశారు. మణిపూర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ తౌనాజమ్ బృందా తనకిచ్చిన గ్యాలంట్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగిచ్చేసింది. ఇంఫాల్‌లోని ప్రత్యేక కోర్టు ఏడుగురిని నిర్దోషులుగా ప్రకటించడంతో.. ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలావుంటే, మణిపూర్‌ రాష్ట్రంలో 2018 సంవత్సరంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ముఖ్యమంత్రి పోలీసు పతకాన్ని ప్రదానం చేశారు. సరిహద్దు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా దేశభక్తుల దినోత్సవం సందర్భంగా 2018 లో మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్.. పోలీసు అధికారి తౌనాజోమ్ బృందాకు గ్యాలంట్రీ అవార్డును బహూకరించారు. అనంతరం ఆమెకు అదనపు సూపరింటెండెంట్ పదవికి పదోన్నతి కల్పించారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బీజేపీ మాజీ నేత చందేల్ ఏడీసీ చైర్మన్ లుఖోసే జూ సహా మరో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. అయితే రెండేళ్లపాటు విచారణ జరిపిన ఇంఫాల్‌లోని స్పెషల్ కోర్ట్ ఏడుగురిని నిర్ధోషులు ప్రకటించింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన తౌనాజమ్ బృందా ఈ పతకాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌కు లేఖ రాసి.. గ్యాలంట్రీ అవార్డును వాపస్‌ ఇవ్వడానికి కోర్టు పరిశీలనే కారణమని, డ్రగ్స్‌ దర్యాప్తు ఎంతమాత్రమూ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. నా విధిని సక్రమంగా నిర్వహించలేదని నైతికతో అవార్డును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల, మీ ద్వారా నాకు లభించిన గౌరవానికి నేను అర్హురాలిని కాదని భావిస్తున్నాను. మరింత అర్హతగల, నమ్మకమైన పోలీసు అధికారికి ఇవ్వడానికి వీలుగా రాష్ట్ర హోం శాఖకు గ్యాలంట్రీ అవార్డును తిరిగి ఇస్తున్నాను” అని ఆమె ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.