ఆ చిన్నారి నాటిన మొక్కల్ని చిదిమేస్తే.. ఆమె కంట కన్నీరే..!

కన్నబిడ్డలను ప్రమాదంలో పోగొట్టుకుంటే ఆ తల్లి దు:ఖం ఎలా ఉంటుంది..? కన్నీరుమున్నీరుగా శోకిస్తుంది. విలపించి, విలపించి.. భారమైన మనసులో విషాదాన్ని నింపుకుంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ చిన్నారిది. ఆమె వయసు 9ఏళ్లు. తన చిన్ననాట తాను ప్రేమగా నాటి, పెంచుకున్న మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారినప్పుడు ఆమె ఆనందానికి అంతులేకపోయింది. అయితే ఆ చెట్లను రోడ్ల వెడల్పు కోసం నరికివేశారు అధికారులు. ఇది చూసిన ఆ చిన్నారి వ్యధ ఇంతా అంతా కాదు వెక్కివెక్కి ఏడ్చింది. […]

ఆ చిన్నారి నాటిన మొక్కల్ని చిదిమేస్తే.. ఆమె కంట కన్నీరే..!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2019 | 6:43 PM

కన్నబిడ్డలను ప్రమాదంలో పోగొట్టుకుంటే ఆ తల్లి దు:ఖం ఎలా ఉంటుంది..? కన్నీరుమున్నీరుగా శోకిస్తుంది. విలపించి, విలపించి.. భారమైన మనసులో విషాదాన్ని నింపుకుంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఆ చిన్నారిది. ఆమె వయసు 9ఏళ్లు. తన చిన్ననాట తాను ప్రేమగా నాటి, పెంచుకున్న మొక్కలు పెద్దవై.. చెట్లుగా మారినప్పుడు ఆమె ఆనందానికి అంతులేకపోయింది. అయితే ఆ చెట్లను రోడ్ల వెడల్పు కోసం నరికివేశారు అధికారులు. ఇది చూసిన ఆ చిన్నారి వ్యధ ఇంతా అంతా కాదు వెక్కివెక్కి ఏడ్చింది. మణిపూర్‌లో జరిగిన ఈ సంఘటన హృదయాలను కలచివేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్‌లోని కక్‌చింగ్‌ జిల్లాకు చెందిన వాలెంటీనా ఎలంగ్‌బమ్ అనే చిన్నారి స్థానిక స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. ఆ చిన్నారి ఒకటో తరగతి చదువుతున్న సమయంలో తన ఇంటి సమీపంలో రెండు మొక్కలను నాటింది. అవి కాస్త పెద్దగా మారి చెట్లుగా తయారయ్యాయి. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో రోడ్ల విస్తరణ కోసం ఆ చెట్లను నరికేశారు. అది చూసిన వాలెంటీనా వెక్కి వెక్కి ఏడ్చింది. పడి ఉన్న తన చెట్లను చూస్తుంటే మనసు తట్టుకోలేకపోతుందంటూ ఏడుస్తున్న ఈ చిన్నారిని ఆపడం అక్కడున్న ఎవ్వరివల్ల అవ్వలేదు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. దానిపై మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ స్పందించారు.

‘‘ఆ అమ్మాయి నాటుకునేందుకు కొన్ని మొక్కలను ఇచ్చాం. ఇప్పుడు ఆ బాలికను ‘‘సీఎం గ్రీన్ మణిపూర్ మిషన్‌’కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నాం. ఆ చిన్నారిని ఫాలో అవ్వండి. ప్రకృతిని కాపాడండి’’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఆమె అతి సున్నిత హృదయానికి హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!