‘ఓటర్’ మూవీ రివ్యూ

నటీనటులు : మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్ త‌దిత‌రులు. దర్శకత్వం : జి కార్తీక్ రెడ్డి నిర్మాత :జాన్‌ సుధీర్‌ పూదోట సంగీతం :యస్ తమన్ సినిమాటోగ్రఫర్ :అశ్విన్ హీరో మంచు విష్ణు, సురభి జంటగా జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ “ఓటర్”. ప్రస్తుత రాజకీయ పరిస్తితులపై వ్యంగ్యాస్త్రంగా, పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యింది. మరి ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంతమేర మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం కథ : యూఎస్‌లో […]

'ఓటర్' మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jun 21, 2019 | 5:48 PM

నటీనటులు : మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్ త‌దిత‌రులు. దర్శకత్వం : జి కార్తీక్ రెడ్డి నిర్మాత :జాన్‌ సుధీర్‌ పూదోట సంగీతం :యస్ తమన్ సినిమాటోగ్రఫర్ :అశ్విన్

హీరో మంచు విష్ణు, సురభి జంటగా జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ “ఓటర్”. ప్రస్తుత రాజకీయ పరిస్తితులపై వ్యంగ్యాస్త్రంగా, పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యింది. మరి ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంతమేర మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం

కథ : యూఎస్‌లో జాబ్ చేస్తోన్న గౌతమ్ (మంచు విష్ణు) ఓటు వేయడానికి ఇండియా వస్తాడు. ఈ క్రమంలో సురభిని చూసి ప్రేమలో పడతాడు. అయితే సురభి తను ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తేనే ప్రేమను అంగీకరిస్తానంటుంది. అయితే ఆ టాస్క్ ను గౌతమ్ పూర్తి చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ (సంపత్ రాజ్) పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టే స్థలాన్ని కబ్జా చేస్తాడు. ఆ స్థలాన్ని తిరిగి పేదలకు వచ్చేలా చేస్తానని గౌతమ్ ఆ పేదలకు మాట ఇస్తాడు. సెంట్రల్ మినిస్టర్ నుండి ఆ ల్యాండ్ లాక్కోవటానికి గౌతమ్ ఎటువంటి స్కెచ్ వేశాడు ? ఈ మధ్యలో రీకాల్ ఎలెక్షన్ ఎందుకు వచ్చింది ? చివరికి ఆ స్థలం పేదలకు దక్కేలా చేయగలిగాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై మూవీని వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : ప్రస్తుత రాజకీయాల గురించి సినిమాలో చర్చించిన ‘రీకాల్ ఎలెక్షన్’ అనే థీమ్‌తో దర్శకుడు కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే రాజకీయ నాయకుల గురించి ఈ చిత్రంలో దర్శకుడు జి కార్తీక్ రెడ్డి ప్రస్తావించిన అంశాలు కూడా ప్రజల్లో కొత్త ఆలోచలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా జి కార్తీక్ రెడ్డి రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ లో వచ్చే పోసాని ట్రాక్.. అలాగే విష్ణు ఇండియా గురించి చెప్పే సన్నివేశం వంటి కొన్ని కీలకమైన సీన్స్ బాగున్నాయి.

ఇక ఈ సినిమాలో మంచు విష్ణుని కొత్త యాంగిల్‌లో ఆవిష్కరించాడు దర్శకుడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయి.  ఇక హీరోయిన్ సురభి యధావిధిగా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. విష్ణు, సురభి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో..ఇద్దరి మధ్య వచ్చే  లవ్ సీన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి . సెంట్రల్  మినిస్టర్ గా సంపత్ రాజ్ మెప్పించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ప్రధానంగా పోసాని తన కామెడీ టైమింగ్ తో సినిమాని మరో మెట్టు ఎక్కించాడు.

మైనస్ పాయింట్స్ : అయితే రాజకీయాలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించని వారిని ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే. కథనంలో అక్కడక్కడ లోటుపాట్లు కనిపిస్తాయి. ఒక బలమైన కాన్‌ఫ్లిక్ట్ లేకపోవడంతో సెకండాఫ్‌లో సినిమా కాస్త డౌన్ అయింది. రచయితగా, దర్శకుడిగా జి కార్తీక్ రెడ్డి పాసైనా..సినిమా కోసం బలమైన టీంను తీసుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అదే ఈ మూవీని మరింత ఎత్తుకు తీసుకెళ్లలేకపోయింది.

ఫైనల్ రిపోర్ట్:  పొలిటికల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారిని బాగా మెప్పించి..సాధారణ ప్రేక్షకులతో ఓకే అనిపించుకోని..రాజకీయాలు తెలియని ఆడియెన్స్‌ను నిరుత్సాహపరిచే మూవీ ‘ఓటర్’.