తిరుమలలో అవినీతి రహిత పరిపాలన జరుగుతోంది.. భక్తులందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం చాలా సంతోషం : మోహన్ బాబు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ..

  • Venkata Narayana
  • Publish Date - 11:21 am, Thu, 14 January 21

తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయి మంచు లక్ష్మి. సంక్రాంతి పర్వదిన వేళ ఉదయాన్నే వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో అవినీతి రహిత పరిపాలన జరుగుతోందని మోహన్ బాబు అన్నారు. అవినీతికి తావులేకుండా టీటీడీ అధికారులు భక్తులందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం చాలా సంతోషకరమన్నారు. కరోనా భోగి మంటల్లో భస్మం అయిపోయిందని, ఇక నుండి అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.