Breaking News
  • ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సు సర్వీసులపై క్లారిటీ. పండుగకు ఏ రాష్ట్ర సరిహద్దు వరకు ఆ రాష్ట్ర బస్సులు. ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన టీఎస్‌ ఆర్టీసీ ఎండీ. తాత్కాలిక అవసరాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోలేం. రెండు రోజులు ఆలస్యమైనా శాశ్వత ఒప్పందం చేసుకున్నాకే.. ఏపీకి తెలంగాణ బస్సులు.. తెలంగాణకు ఏపీ బస్సులు నడుస్తాయి. ఈ నెల 27 తర్వాతే రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు. -తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

‘బిల్లా రంగా’ : ఆ ఇద్దరూ రెడీనా !

టాలీవుడ్‌లో మంచు కుటుంబానికి సెపరేట్ ఐడెంటిడీ ఉంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం..ఏది అనుకుంటే అది చేయడం వారి స్టైల్.

Manchu Manoj Ready For 'Billa Ranga' Remake, ‘బిల్లా రంగా’ : ఆ ఇద్దరూ రెడీనా !

టాలీవుడ్‌లో మంచు కుటుంబానికి సెపరేట్ ఐడెంటిడీ ఉంది. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడం..ఏది అనుకుంటే అది చేయడం వారి స్టైల్. అయినా  కొన్ని వందల చిత్రాలలో విలక్షణ పాత్రలు వేసిన మోహన్‌బాబు గారి స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటండి. అయితే ఆయన వారసులు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. మనోజ్, విష్ణులకు గత కొంతకాలంగా సరైన హిట్లు లేవు. కాకపోతే మనోజ్ ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకోవడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అతిథి పాత్రలు కూడా చేస్తాడు. వేదంలో అతడు చేసిన పాత్రకు మంచి మార్కులు దక్కాయి. మల్టీస్టారర్లు చేయడం పట్ల కూడా అతడికి బాగానే ఆసక్తి ఉంది. కానీ సరైన కాంబినేషన్ వర్కువుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు మనోజ్ స్వయంగా ఓ మల్టీస్టారర్ కోసం ఓపెన్ ప్రపోజల్ పెట్టాడు సాయి తేజ్ ముందు. గురువారం తేజు బర్త్ డే. ఈ సందర్భంగా అతణ్ని ఆఫ్యాయంగా బాబాయ్ అని సంబోధిస్తూ ట్వీట్ పెట్టాడు మనోజ్. తేజు బర్త్ డే రోజే మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిల్లా రంగా’ 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విషయాన్ని అతను గుర్తు చేశాడు. అక్టోబరు 15న విడుదల అంటూ అప్పటి సినిమా పోస్టర్ కూడా పోస్ట్ చేశాడు. ఇది పంచుకోవడం ద్వారా తాను ఏం చెప్పదలుచుకున్నానో సాయి తేజ్ అర్థం చేసుకోవాలని.. ‘నేనైతే రెడీగా ఉన్నా. మరి నీ సంగతేంటి’ అని ప్రశ్నించాడు మనోజ్. ( రచ్చ కాంబినేషన్..పూరీతో యశ్ ! )

ఇంతకుముందు మంచు మనోజ్ నటించిన ‘గుంటూరోడు’ చిత్ర వేడుకలో పాల్గొన్న తేజు.. తామిద్దరం ఎప్పట్నుంచో ‘బిల్లా రంగా’ రీమేక్‌లో నటించాలనుకుంటున్నామని చెప్పాడు. దాని సంగతేంటని మనోజ్‌ను ప్రశ్నించాడు. ఆ రీమేక్‌ను సరిగా డీల్ చేయగలిగే డైరెక్టర్ దొరికినపుడు కచ్చితంగా చేద్దామని మనోజ్ చెప్పాడు. మరి ఇప్పుడు మనోజ్ ఈ రీమేక్‌లో నటించడానికి రెడీ అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. మరి తేజు ఏమంటాడో చూడాలి. ( సాగర తీరాన..సతీ సమేతంగా )

Related Tags