‘సినిమా తల్లిని’ గుర్తు చేసుకున్న మంచు మనోజ్

సావిత్రి లేని లోటును సౌందర్య భర్తీ చేసిందనే చెప్పాలి. తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా సినిమాలలో నటించారు. దాదాపు ఈమె నటించిన సినిమాలన్ని మంచి...

'సినిమా తల్లిని' గుర్తు చేసుకున్న మంచు మనోజ్
Follow us

|

Updated on: Jul 18, 2020 | 2:33 PM

సౌందర్య అనే పదానికి నిండు అర్థం తీసుకొచ్చారు నటి సౌందర్య.  మహానటి సావిత్రి తర్వాత తెలుగు వారిని బాగా ఆకట్టుకున్న హీరోయిన్ సౌందర్య. చెప్పాలంటే దాదాపు సావిత్రి లేని లోటును సౌందర్య భర్తీ చేసిందనే చెప్పాలి. తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా సినిమాలలో నటించారు. దాదాపు ఈమె నటించిన సినిమాలన్ని మంచి విజయాలను అందుకున్నాయి. సెలెక్టెడ్‌గా సినిమాలను ఎంచుకోవడంలో చాలా మంది హీరోయిన్లు సౌందర్యనే ఇన్స్ప్రేషన్‌గా తీసుకుంటున్నారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సౌందర్య 2004లో ఓ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే ఈ రోజు తెలుగు సినీ ప్రేమికులు మిస్సైన సౌందర్య పుట్టిన రోజు ఈ రోజు.

ఈ సందర్భంగా మంచు హీరో మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా సౌందర్యకు నివాళులర్పించారు. `సౌందర్యగారి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను. మీరు అద్భుతమైన నటి, గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నా ‘సినీ అమ్మ’. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి’ అంటూ.. మంచు మనోజ్ ట్వీట్ చేశారు.