మోదీ, ఒబామా ఇద్దరూ గ్రేటే ! గ్రిల్స్..

man vs wild show host on similar experiences with pm modi, barack obama

అడ్వెంచర్ జంకీ, మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో హోస్ట్ అయిన బేర్ గ్రిల్స్.. ఒక దేశ ప్రధాని, మరో దేశ మాజీ అధ్యక్షునితో తనకు కలిగిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఇటీవల భారత ప్రధాని మోదీతోనూ, గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోను తానిలాగే అడ్వెంచర్ షోలు నిర్వహించానని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తులు చేసిన ఈ మహోన్నత కార్యం తననెంతో ప్రభావితం చేసిందని ఆయన తెలిపారు. 2016 లో ఒబామాతో అలాస్కాలో తానిలాంటి షో నిర్వహించానని, అయితే అత్యంత శీతలమైన అలాస్కాకు, వర్షపు నీరు, తేమతో కూడిన ఉత్తరాఖండ్ కు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నాడు.

పర్యావరణ పరిరక్షణ.. ప్రపంచ భద్రతకు ఉద్దేశించిన కన్సర్వేషన్ ప్రాజెక్టుల నిర్వహణ.. వీటికి అటు ఒబామా.. ఇటు మోదీ ఇద్దరూ ఎంతో ప్రాధాన్యమివ్వడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని గ్రిల్స్ అన్నాడు. ప్రపంచ నాయకులైన ఈ ఇద్దరితో కలిసి పని చేయడం తన ప్రివిలేజ్ అని అభివర్ణించాడు. నాడు ఒబామా కూడా ప్రకృతిని మోదీ మాదిరే ఎంతో అభిమానించేవారన్నాడు. ప్రధాని మోదీ వెజిటేరియన్ అని, అలాంటి వ్యక్తి చిట్టడవుల్లో తనతో తిరగడం ఆశ్చర్యం కల్గించినట్టు ఆయన చెప్పాడు.. మోదీకి తాను బరిసెను ఇవ్వడం… దాని గురించి మోదీ వివరంగా తన నుంచి తెలుసుకోవడం.. అదో విచిత్రమైన అనుభూతి అని గ్రిల్స్ వ్యాఖ్యానించాడు. ఉత్తరాఖండ్ అడవుల్లో ఆయనతో సాహసోపేతంగా గడిపిన వైనంలో.. తను ముఖ్యమైనదని భావించిన 45 సెకండ్ల స్పెషల్ ఎపిసోడ్ ను గ్రిల్స్ గత నెలలో షేర్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *