Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

Man Vs Wild: ‘పిసినారి’ డిస్కవరీ.. చెల్లింపు.. ప్చ్

Man Vs Wild: Jim Corbett National Park reportedly made Rs.1.26 lakh from Modi Episode, Man Vs Wild: ‘పిసినారి’ డిస్కవరీ.. చెల్లింపు.. ప్చ్

ప్రముఖ డిస్కవరీ ఛానెల్ వ్యాఖ్యాత బీర్ గ్రిల్స్‌తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాహసాలను మ్యాన్ వర్సెస్ వైల్డ్‌‌లో సోమవారం రాత్రి ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ఇక ఈ షోలో తన చిన్నప్పటి అనుభవాలు, కష్టాలతో పాటు భారత దేశ ఔన్నత్యం, తదితరాలపై బీర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు మోదీ. కాగా ఈ షోతో మోదీ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకున్న డిస్కవరీ ఛానెల్ వారు మంచి టీఆర్పీలనే ఆర్జించారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం పార్క్ నిర్వాహకులకు ముట్టిన అమౌంట్ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.

ఈ ఎపిసోడ్ మొత్తాన్ని డిస్కవరీ ఛానెల్ వారు ఉత్తర ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్క్‌లో చిత్రీకరించారు. కాగా అక్కడ షూటింగ్ జరుపుకోవడం కోసం డిస్కవరీ ఛానెల్ వాళ్లు పార్క్ నిర్వాహకులకు కేవలం రూ1.26లక్షలు చెల్లించారట. ఈ ఎపిసోడ్‌ను చేయడం కోసం కొన్ని నెలల క్రితమే ఛానెల్ నిర్వాహకులు తమకు వినతి పత్రాన్ని ఇచ్చారని.. ఎంట్రీ ఫీజుతో పాటు ఇక్కడ ఉండేందుకు వారు డబ్బులు చెల్లించారని పార్క్ డైరక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే పార్క్‌లోని కాలాఘర్, దికాలా, సాంబార్ రోడ్, గేటియా, ఖిననౌలి తదితర ప్రదేశాల్లో ఈ షూటింగ్ మొత్తం జరిగినట్లు పార్క్ నిర్వాహకులు వెల్లడించారు.