అంత్యక్రియలకు డబ్బుల్లేక..అమ్మ శవాన్ని..డస్ట్ బిన్‌లో..

Mother dead body in the dustbin

అమ్మ..ఆమె గురించి ఎంతని చెప్తాం..ఏమని చెప్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర అమోఘమైనది, అద్వితీయమైనది. అమ్మ గురించి ఎంత గొప్పగా మాట్లాడినా తక్కువగానే అనిపిస్తుంది. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అంటారు. కానీ ఓ ప్రబుద్దుడు మాత్రం నవమాసాలు మోసి..కని..పెంచిన అమ్మ చనిపోతే ఆమెకు అంత్యక్రియలు కూడా చేయలేకపోయాడు.

అందుకు డబ్బులు లేవంటూ కన్నతల్లి శవాన్ని చెత్తకుండీలో పారేసి చేతులు దులుపుకొన్నాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌కు చెందిన ముత్తులక్ష్మణన్‌ ఆలయ పూజారి. సోమవారం ఉదయం ఆయన తల్లి వసంతి మృతదేహం చెత్తకుండీలో ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విచారణలో ముత్తులక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని చెత్తకుండీలో పడేేసి వెళ్లినట్లు తేలింది. వయోభారం కారణంగా తల్లి మృతి చెందిందని, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఈ పని చేసినట్లు ముత్తులక్ష్మణన్‌ తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *