ఇది పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్

కలకలం సృష్టించిన  సంగారెడ్డి హైవేపై జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద నేషనల్ హైవేపై వెళ్తున్న మహబూబ్‌ అనే వ్యక్తిని బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు… అతన్ని అడ్డుకుని నరికి చంపారు. ఆ తర్వాత బైక్ పై పారిపోయారు. మొదట పాతకక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగుండొచ్చని పోలీసులు భావించారు. కానీ ఇది సుపారి హత్య అని ప్రాథమిక తేల్చారు అధికారులు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ముఠాల మధ్య విభేదాలతో […]

ఇది పక్కా ప్లాన్డ్ సుపారీ మర్డర్
Follow us

|

Updated on: Jun 02, 2019 | 9:58 AM

కలకలం సృష్టించిన  సంగారెడ్డి హైవేపై జరిగిన మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం వద్ద నేషనల్ హైవేపై వెళ్తున్న మహబూబ్‌ అనే వ్యక్తిని బైక్‌పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు… అతన్ని అడ్డుకుని నరికి చంపారు. ఆ తర్వాత బైక్ పై పారిపోయారు. మొదట పాతకక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగుండొచ్చని పోలీసులు భావించారు. కానీ ఇది సుపారి హత్య అని ప్రాథమిక తేల్చారు అధికారులు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ముఠాల మధ్య విభేదాలతో గత ఏడాది నవంబర్‌లో హర్షద్‌ హుస్సేన్‌ను లక్డారంలో మహబూబ్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. దానికి ప్రతీకారంగా శుక్రవారం రుద్రారంలో అతడిని చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే హర్షద్‌ అనుచరులు మహబూబ్‌ హత్యకు కర్ణాటకకు చెందిన నేరస్థులకు సుపారీ ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.

హర్షద్‌ హత్య కేసులో శుక్రవారం సంగారెడ్డి కోర్టుకు మహబూబ్‌, సమీర్‌ హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ హత్య జరిగింది. వారిని దాదాపు 30 మంది వెంబడించి మరీ హత్య చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్‌ను హత్య చేస్తున్న సమయంలో ప్రధాన నిందితుడి చేతిలో తుపాకీ ఉన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఘటనా స్థలంలోనే నలుగురు నిందితులను పోలీసులు గుర్తించగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.