రోడ్డుపై ఉమ్మేసినందుకు.. ట్రాఫిక్ పోలీసుల పనిష్మెంట్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మాస్కు

రోడ్డుపై ఉమ్మేసినందుకు.. ట్రాఫిక్ పోలీసుల పనిష్మెంట్..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 12:57 PM

Man spits on road: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మాస్కు ధరించకపోయినా, రోడ్డుపై ఉమ్ము వేసినా, గుంపులు గుంపులుగా తిరిగినా భారీ చలానాలు విధించడమేగాక, తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

కాగా.. తాజాగా చండీఘర్‌లో జరిగిన ఓ ఘటన నెట్టింట్లో వైరల్ అయింది. జాలీగా టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు నడిరోడ్డుపై ఉమ్మి వేశాడు. అయితే తనను ఎవరూ గమనించడం లేదనుకున్న సదరు యువకుడిని ఓ అధికారి చూశాడు. వెంటనే అతన్ని ఆపి బుద్ధొచ్చేలా శిక్ష వేశాడు. సాధారణ చలాన్లతో పని కాదనుకున్న ఆయన.. అక్కడికక్కడే శుభ్రం చేయించాడు. అయితే సదరు యువకుడు స్వహస్తాలతో క్లీన్ చేయడం కొసమెరుపు.