Breaking News
  • చిత్తూరు: పలమనేరు మండలం మండిపేటలో ఎనుగుల విధ్వంసం. పంటపొలాలపై దాడి, కొబ్బరి చెట్లు ధ్వంసం. పశువులపైనా దాడి చేసిన గజరాజులు. దూడ మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలు. భయాందోళనలో రైతులు.
  • ప.గో: భీమడోలు మండలం పొలసానిపల్లిలో హత్యాయత్నం. భర్తను చంపేందుకు యత్నించిన భార్య. కూరలో సైనైడ్‌ కలిపి భర్తకు వడ్డించిన భార్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గురునాథ్‌. భార్య రాణి, కొడుకు సహా మరోముగ్గురిపై కేసు నమోదు.
  • హైదరాబాద్‌: పంజాగుట్టలో దొంగల బీభత్సం. అర్ధరాత్రి ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళలు. ఓ మహిళపై సుత్తితో దాడి చేసిన దొంగ. మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • సెల్ఫ్‌ డిసిప్లేన్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైన్‌లు వేసినంత మాత్రానా మార్పు రాదు. వాహనదారులు స్వీయ క్రమశిక్షణ అలవర్చుకోవాలి. బయోడైవర్సిటీ ప్రమాదం తర్వాత అనేక చర్యలు చేపట్టాం. వాహనదారుల్లో మార్పు రాకుంటే నిర్దిష్ట వేగాన్ని కఠినంగా అమలు చేస్తాం. వాహనదారులు సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారు కాబట్టి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటించేవారు కూడా నష్టపోతున్నారు -టీవీ9తో ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌.
  • ఖమ్మం కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత. రెండు రోజుల క్రితం అదృశ్యమైన హాస్టల్‌ విద్యార్థి మృతదేహం లభ్యం. గోపాలపురం దగ్గర ఎన్‌ఎస్పీ కాలువలో మృతదేహం గుర్తింపు. మృతదేహంతో కలెక్టరేట్‌ దగ్గర బంధువుల ఆందోళన.
  • అమరావతి: ఐటీ దాడుల పూర్తి పంచనామా రిపోర్ట్‌ విడుదల. భారీగా డైరీలు, రిజిస్టర్‌లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన ఐటీశాఖ. కొన్ని విలువైన డాక్యుమెంట్లు సీజ్‌. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన లాకర్లు సీజ్‌ చేసినట్టు పంచనామాలో వెల్లడి.

శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. రూ. 5 లక్షలు స్వాహా!

Man Booked For 5 Lakhs Fraud For Shriya Saran Dates In Reality Show, శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. రూ. 5 లక్షలు స్వాహా!

ఈజీ మనీ కోసం.. అమాయకులను మోసం చేయటానికి కేటుగాళ్లు ఎన్నెన్నో కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా  ప్రముఖ నటి శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. ఓ మీడియా ప్రతినిధి ఏకంగా రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ కేసులో అతనికి ఓ మహిళ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బంజారా హిల్స్‌కు చెందిన చంద్రనాయుడు అనే సినీ దర్శకుడు తన ఛానల్‌లో పెద్ద ఎత్తున రియాలిటీ షోకు భారీగా ప్లాన్ చేశాడు. ఇక ఆ షోకు సీనియర్ నటి శ్రియ జడ్జిగా వ్యవహరిస్తే.. టీఆర్పీ రేటింగ్స్ బాగుంటాయని అనుకున్నాడు. అంతేకాకుండా ఆమెను కాంటాక్ట్ కావడం కోసం.. పలువురితో డీలింగ్స్ కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధి అయిన చైతన్య అతనికి పరిచయమయ్యాడు. సదరు దర్శకుడు, చైతన్యకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. ఇక డబ్బు మీద దుర్బుద్ధి కలిగిన చైతన్య పక్కాగా ఓ స్కెచ్ వేశాడు.

హీరోయిన్ శ్రియ డేట్స్ అన్నింటినీ చూసే మేనేజర్ ఈమేనంటూ లక్షీ సింధూజ అనే అమ్మాయిని పరిచయం చేయడమే కాకుండా.. ఆమెకు ఆ దర్శకుడు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇప్పించేలా చైతన్య ప్రేరేపించాడు. ఇంకేముంది డబ్బు మొత్తం ముట్టిన తర్వాత ఈ జంట కనిపించకుండా పోయింది.

సదరు దర్శకుడు వివిధ మార్గాల ద్వారా వారిని కాంటాక్ట్ చేద్దామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న చంద్రనాయుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Related Tags