టిఫిన్‌లో తలవెంట్రుక కనిపించడంతో.. ఓ భర్త ఎంతపని చేశాడో తెలుసా?

Man Shaves Wife's Head After Finding Hair In Food, టిఫిన్‌లో తలవెంట్రుక కనిపించడంతో.. ఓ భర్త ఎంతపని చేశాడో తెలుసా?

రోజులు మారుతున్నా.. మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉందనడానికి ఉదాహరణగా  ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దేశం ఏదైనా సరే దాడులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  బంగ్లాదేశ్ ‌రాజధాని జోయ్‌పూర్హట్ ప్రాంతంలో ఓ అమామనవీయ ఘటన చోటు చేసుకుంది. భార్య తయారు చేసిన టిఫిన్‌లో తల వెంట్రుక కనిపించిందనే కారణంతో ఏకంగా ఆమెకు శిరోముండనం చేయించాడు ఓ భర్త.

పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్‌లోని జోయపుర్హట్ జిల్లాలోగల ఓ గ్రామంలో బాబుల్ మండల్(37) అనే వ్యక్తి తన 23ఏళ్ల భార్యను టిఫిన్ అడిగాడు. అడిగిన వెంటనే ఆమె పాలు, రొట్టెతో కలిపి టిఫిన్ రెడీ చేసి వేడివేడిగా అతడికి దాన్ని వడ్డించింది. అయితే ఆ టిఫిన్‌లో బాబుల్ మండల్‌కి ఓ తల వెంట్రుక కనిపించింది. దీన్ని గమనించిన అతడు ఆ వెంట్రుక ఆమెదే అని తీవ్రంగా నిందిస్తూ .. ఆగ్రహానికి గురై భార్యను తీవ్రంగా కొట్టాడు. అక్కడితో కోపం చల్లారకపోవడంతో ఏకంగా బ్లేడ్‌తో ఆమె తలను మొత్తం గుండుగా మార్చేశాడు. వద్దు వద్దు అని ఎంత ప్రాధేయపడ్డా భర్త విడిచిపెట్టలేదు. దీంతో బాబుల్ మండల్ ఇంట్లోనుంచి కేకలు అరుపులు విన్న స్ధానికులు వచ్చి చూసి అతడిపై తీవ్రంగా మండిపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడ్ని అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అత్యాచారాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెల వరకు 630 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని, 37 మంది మహిళలు అత్యంత దారుణంగా చంపబడ్డారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణంలో ఈ చర్యకు పాల్పడ్డ బాబుల్ మండల్‌కి 14 సంవత్సరాల జైలు శిక్షపడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *