తాత పుస్తకాలు తెరిచిన మనవడు షాక్.. గాంధీ, నెహ్రూల సంతకాలతో ఆటోగ్రాఫ్‌లే ఆటోగ్రాఫ్‌లు.. ఎక్కడంటే?

అరుదైన వస్తువులు దొరికినప్పుడు లభించే ఆనందానికి అవధులు ఉండవు. కోట్లు పోసి కొందమన్నా దొరకని అపురూపాలు చేతికందితే ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభూతినే ట్విట్టర్ వేదిక ఓ నెటిజన్ పంచుకున్నాడు. అది ఏంటంటే....

తాత పుస్తకాలు తెరిచిన మనవడు షాక్.. గాంధీ, నెహ్రూల సంతకాలతో ఆటోగ్రాఫ్‌లే ఆటోగ్రాఫ్‌లు.. ఎక్కడంటే?
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2020 | 7:54 PM

Man says he found signatures of Gandhiji, ex-PM Nehru in grandfather’s book అరుదైన వస్తువులు దొరికినప్పుడు లభించే ఆనందానికి అవధులు ఉండవు. కోట్లు పోసి కొందమన్నా దొరకని అపురూపాలు చేతికందితే ఆ ఆనందమే వేరు. అలాంటి అనుభూతినే ట్విట్టర్ వేదిక ఓ నెటిజన్ పంచుకున్నాడు. అది ఏంటంటే….

పాత పుస్తకం తెరిస్తే ‘తాత’ సంతకం…

విజయ్ బస్రూర్ అనే నెటిటన్ తన తల్లికి ఇంటిని సర్దడంలో సాయం చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇంటిలోని ఓ ప్రదేశంలో ఒక పుస్తకం దొరికింది. అది తెరిచిన అతడు షాక్‌కు గురయ్యాడు. కొద్ది సేపు అతడికి ఏమీ అర్థం కాలేదు. తేరుకున్న తర్వాత వెతకడం మొదలెట్టాడు. ఆ తర్వాత తెలిసింది. ఆ పుస్తకం తన తాత ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న పుస్తకం అని, అందులో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, అంబేద్కర్ సంతకాలు ఉన్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దానిని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నెటిజన్లు సైతం బస్రూర్ ను అభినందిస్తున్నారు. విలువైన వస్తువును గెలిచావని అంటున్నారు.