హోంగార్డ్ భర్త…భార్యను హతమార్చేందుకు సినీ ఫక్కీలో ప్లాన్..

ప్రేమించి ...పెళ్లి చేసుకున్న ఇల్లాలు ను కడతేర్చాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు... సినీ ఫక్కీలో నదిలోకి తోసి హత్య చేయాలని పథకం పన్నాడు...కట్టుకున్న భర్తే హత్య చేయాలని చూడడంతో ఆ మహిళ కోవెలకుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హోంగార్డ్ భర్త...భార్యను హతమార్చేందుకు సినీ ఫక్కీలో ప్లాన్..
Follow us

|

Updated on: Sep 22, 2020 | 6:18 PM

ప్రేమించి …పెళ్లి చేసుకున్న ఇల్లాలు ను కడతేర్చాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు… సినీ ఫక్కీలో నదిలోకి తోసి హత్య చేయాలని పథకం పన్నాడు… నదిలో కొట్టుకు పోతున్న మహిళ కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చి ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్చారు… కట్టుకున్న భర్తే హత్య చేయాలని చూడడంతో ఆ మహిళ కోవెలకుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. . ఆళ్లగడ్డ మండలం మర్రి పల్లె గ్రామానికి చెందిన పత్తి భాస్కర్ హైదరాబాదులోని ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం కామనూరు గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.. వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది …వీరి వివాహనికి పెద్దలు ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగినప్పటికీ వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నెల 16న భార్యతో కలిసి భాస్కర్ హైదరాబాద్ నుండి స్వగ్రామం వచ్చాడు… సోమవారం కొవెలకుంట్ల మండలం లోని గుల్లదుర్తి గ్రామం లో ఉన్న తన సోదరుని చూసేందుకు భాస్కర్ భార్య తో కలిసి టూవీలర్‌పై బయలుదేరారు. గుల్లదుర్తి గ్రామ శివారులోని కుందూ నది వంతెన వద్ద వాహనాన్ని ఆపి నీటి ప్రవాహాన్ని చూస్తూ… సెల్ఫీ తీసుకుందామని భార్యకు చెప్పి అమాంతంగా ఆమెను నది లోకి తోసేశాడు.

నదిలో పడి పోయిన ఆ మహిళ కొట్టుకుపోగా,.. తానూ చేసిన ఈ ఆకృత్యం నుంచి బయటపడేందుకు బైక్ ను నీటిలో తోసి తాను నదిలోకి దూకి క్షేమంగా ఒడ్డుకు చేరాడు. అనంతరం ప్రమాదం జరిగిందంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదృష్టవశాత్తు నదిలో పడి పోయిన అతడి భార్య నీటి వేగానికి నాలుగు కిలోమీటర్ల వరకు నదిలో కొట్టుకు పోయింది. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి ఆమెను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. జరిగిన ఘటనపై బాధిత యువతి కోయిలకుంట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోంగార్డు భాస్కర్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!