మొబైల్ కోసం ఆర్డరిస్తే..నిర్మా సబ్బులొచ్చాయ్

Customer Receives two detergent soaps instead of mobile in amazon online order, మొబైల్ కోసం ఆర్డరిస్తే..నిర్మా సబ్బులొచ్చాయ్

ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కాస్త ముందూ వెనక ఆలోచించండి. ఆఫర్లు ఉన్నాయి కదా అని టెమ్ట్ అయిపోతే..తర్వాత తెల్లమొహం వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్‌లో తాము ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి వచ్చాయంటూ రోజుకు వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అయితే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వీటికి మినహయింపు కాదు అనిపిస్తోంది. తాజాగా ఖమ్మం జిల్లా… సత్తుపల్లి పట్టణం పాత సెంటర్‌లో అమృత సురేష్ సెల్ వరల్డ్ షాపు యాజమాని అమెజాన్‌లో రెడ్ మీ Y3 మొబైల్ కోసం ఆర్డరిచ్చాడు. రూ.11,999 రూపాయలు ముందుగానే చెల్లించాడు. తీరా ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే… అందులో మొబైల్‌కి బదులు రెండు నిర్మా సబ్బులు రావటంతో షాపు యాజమాని షాక్ అయ్యాడు. అసలు రెడ్ మీ బాక్స్‌లో నిర్మా సబ్బులు ఎందుకు పెట్టారనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *