‘నా గర్ల్ ఫ్రెండ్ నన్ను కాదంది, అందుకే, నన్ను నేనే పెళ్లాడా ‘! బ్రెజిల్ లో ఓ వింత !
బ్రెజిల్ లో ఓవింత వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తనకు దూరమైందని, దీంతో చేసేదిలేక తనను తానే పెళ్లాడానని చెబుతున్నాడు.!
Follow us
బ్రెజిల్ లో ఓవింత వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి తనకు దూరమైందని, దీంతో చేసేదిలేక తనను తానే పెళ్లాడానని చెబుతున్నాడు.! డియోగో రాబెలో అనే ఈ పెద్దమనిషి గత నెల 17 న తన పెళ్లి శుభలేఖల్లాంటివి తానే చేతబట్టుకుని ‘తనను తాను వివాహం చేసుకున్నాడు’. ఇతని గత చరిత్రలోకి వెళ్తే.. డియోగో, ఇతని ప్రేయసి వైటర్ బ్యూనో గత ఏడాది నవంబరులో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అక్టోబరు 17 న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ తరువాత ఏదో విషయమై ఇద్దరి మధ్యా గొడవలొచ్చి.. విడిపోయారు. దీంతో 33 ఏళ్ళ రాబెలో…ఇలా లాభం లేదని తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. అక్టోబరు 17 న ఓ లగ్జరీ రిసార్టులో తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నన్ను నేనే పెళ్లి చేసుకున్నా అని చిరునవ్వుతో చెబుతున్నాడు. ఆ రోజును తన హ్యాపీయెస్ట్ డే అని అబ్జివర్ణించాడు. ట్రాజెడీగా మారాల్సిన రోజు కామెడీగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు. తన మాజీ లవర్ కి థాంక్స్ కూడా చెబుతూ..నీ మీద గౌరవం తనకు తగ్గలేదని, నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చునని ఈ మాజీ ప్రియుడు తన ‘విశాల హృదయాన్ని’ చాటుకున్నాడు.