Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

ట్విస్టుల మీద ట్విస్టులు..ఐసీయూలో పెళ్లి..వరుడు పరార్‌

After She Attempts Suicide, ట్విస్టుల మీద ట్విస్టులు..ఐసీయూలో పెళ్లి..వరుడు పరార్‌

పెళ్లంటే అందంగా అలంకరించిన కల్యాణ మండపం, మేళతాళాలు, బంధువులు, సన్నిహితులు..అబ్బో ఆ సందడే వేరు. ఐతే పుర్రెకో బుద్ధి, జిహ్వకో చాపల్యం అన్నట్లు ఈ రోజుల్లో కొంతమంది చిత్ర విచిత్రంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్లేన్, షిప్స్‌ ఇలా రకరకాల పెళ్లిళ్లు చూశాం. కానీ హాస్పిటల్‌లో..అదీ ఐసీయూలో మ్యారేజ్‌ ఎప్పుడైనా చూశారా..? ఐసీయూలో పెళ్లేంటి అనుకుంటున్నారా..? అవును ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో వధువుకు మూడు ముళ్లు వేశాడు వరుడు. ఏదో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వధువుకు చివరి నిమిషంలో ఇలా తాళి కట్టారులే అనుకుంటే మీరు జీలకర్ర బెల్లంలో కాలేసినట్లే.  ప్రేమ పేరుతో మోసం చేసి పత్తా లేకుండా పోయిన కిలాడీ యువకుణ్ణి పట్టుకొచ్చి ఇలా వివాహం జరిపించారు.

మహారాష్ట్ర పుణే జిల్లాకు చెందిన నలవాడే అనే యువకుడు ఓ యువతితో కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. తీరా పెళ్లి మాటెత్తగానే ఆమెది తక్కువ కులమని..ముఖం చాటేశాడు.
దీంతో ప్రియుడు మోసం చేశాడనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఆ యువతి. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె సూసెడ్‌ అటెంప్ట్‌ చేయడానికి కారణం తెలుసుకున్న స్థానికులు..అతన్ని పట్టుకొచ్చి ఆస్పత్రి ఐసీయూలోనే తాళి కట్టించారు.

ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. బలవంతంగా పెళ్లైతే చేసుకున్నాడు గానీ..ఆమెతో కాపురం చేయనని మూడవరోజే పరారయ్యాడు ఆ కొత్త పెళ్లికొడుకు. ఫోన్‌ చేసినా అందుబాటులో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. నలవాడే తనపై అత్యాచారం చేశాడని..పెళ్లి చేసుకొని పారిపోయాడని కంప్లైంట్‌ ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.