విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన.. ‘అమ్మఒడి’ డబ్బుల కోసం ఆళినే కడతేర్చాడు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Latest Crime News: బడిఈడు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం గురించి అందరికి తెలిసిన

  • uppula Raju
  • Publish Date - 9:38 am, Thu, 14 January 21
man killed his wife for not withdrawing ammavoid scheme money in visakhapatnam

Latest Crime News: బడిఈడు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం గురించి అందరికి తెలిసిన విషయమే.. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.15వేలు అందిస్తున్నారు. అయితే ఈ డబ్బుకోసం ఇద్దరు దంపతుల మద్య గొడవ జరిగి హత్యకు దారితీసింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ, భీమన్న భార్యభర్తలు.

ఇద్దరూ స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సనలుగురు సంతానం. ఇటీవల ప్రభుత్వం జమ చేసిన ‘అమ్మఒడి’ సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఎకౌంట్ లో జమైంది. అయితే భర్త భీమన్న డబ్బులు విత్ డ్రా చేసి ఇవ్వాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమెను అంతమొందించాలని భీమన్న పథకం వేశాడు. భార్య సంతకు వెళ్లింది చూసి తిరిగి వచ్చే సమయంలో పొలాల వద్ద మాటు వేసి బండరాయితో ఆమె తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

Ammavodi Scheme: ‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండి.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..