“వార్నీ… వీడేంటి.. ఇలా ఎక్కేశాడు”..

Man Jumps Over Fence To Climb On Giraffe At Zoo, “వార్నీ… వీడేంటి.. ఇలా ఎక్కేశాడు”..

సాధారణంగా జంతువులను ఇష్టపడని వారు తక్కువగా ఉంటారు. అయితే కొంతమంది జంతువులను చూడగానే వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. కజకిస్థాన్‌లోని షిమ్కెంట్ జూలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌క్లోజర్‌లో అటు ఇటూ తిరుగుతున్న ఓ జిరాఫీని చూసి.. మద్యం మత్తులో ఉన్న ఓ కుర్రాడు అటు వైపుగా వచ్చాడు. బల్లిలా పాకుతూ కంచె పై నుంచి.. జిరాఫీ పై ఎక్కేశాడు. అది చూసి అక్కడున్న తోటివారు షాకయ్యారు. వీడేంటి ఇలా ఎక్కేశాడు. అది ఏమైనా చేస్తే వీడి పరిస్థితేంటి అనుకున్నారు. జిరాఫీని నిమురుతూ.. కాసేపు హల్ చల్ చేశాడు. అక్కడే ఉన్న ఓ టూరిస్ట్ ఇదంతా వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. అయితే కాపేపు అలాగే ఉన్నప్పటికీ.. చిరాకు వేసిందో ఏమో కాసేపటికి ఆ కుర్రాడిని గిరాటేసింది జిరాఫీ. దెబ్బకు అతడి మత్తు దిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *