ప్రాణం మీదికి తెచ్చిన 10 బీర్లు

చైనాకు చెందిన 40ఏళ్ల హూ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి 10బీర్లు తాగాడు. కనీసం యూరిన్ కి కూడా వెళ్లకుండా మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. ఏకంగా 18గంటలపాటు పడుకుని ఉండిపోయాడు. 18గంటల తరువాత తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిపాలయ్యాడు.

ప్రాణం మీదికి తెచ్చిన 10 బీర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 26, 2020 | 5:08 PM

ఓ వ్యక్తి ఫుల్ గా తాగేశాడు. తానేమి చేస్తున్నాడో మర్చిపోయాడు. రోజంతా తాగేసి.. మైమరిచి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలేచసరికి తీవ్రమైన కడుపునొప్పితో కదలలేని స్థితికి చేరుకున్నడు. ఆ తాగుడే అతని ప్రాణం మీదికి తెచ్చింది. చైనాకు చెందిన 40ఏళ్ల హూ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి 10బీర్లు తాగాడు. కనీసం యూరిన్ కి కూడా వెళ్లకుండా మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. ఏకంగా 18గంటలపాటు పడుకుని ఉండిపోయాడు. 18గంటల తరువాత కడుపులో తీవ్రంగా నొప్పిరావడంతో.. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు.హూను వైద్యులు అన్ని పరీక్షలు చేసి బాధితుడి మూత్రాశయం పగిలిపోయిందని చెప్పారు. ప్రాణాలకు ప్రమాదం లేకున్నా మద్యం తాగిన వెంటనే యూరిన్ కు వెళ్లకపోవడమే కారణమని నిర్థారించారు డాక్టర్లు. అతనికి చికిత్స చేసిన వైద్యులు హూను ప్రాణపాయం నుంచి గట్టెక్కించారు. మద్యం సేవించినవారు మూత్ర విసర్జన తప్పక చేయాలని లేదంటే.. అదీ మూత్రాశయాన్ని నాశనం చేస్తుందని డాక్టర్లు చెప్పారు.