దారుణం.. ఆడ కుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు..!

కామంతో కళ్లు మూసుకుపోతున్న కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. వారికి మాత్రం ఏమాత్రం భయం లేకుండా పోతోంది. ఇప్పటి వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ..

దారుణం.. ఆడ కుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డ కామాంధుడు..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 6:10 AM

కామంతో కళ్లు మూసుకుపోతున్న కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా.. వారికి మాత్రం ఏమాత్రం భయం లేకుండా పోతోంది. ఇప్పటి వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డ కామాంధులు.. ఇప్పుడు జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన ఓ దుర్మార్గుడు.. వీధిలో ఉన్న ఓ ఆడకుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తొలుత అతడు కుక్కలను వేధిస్తుండటాన్ని కొందరు గమనించారు. అంతేకాదు.. ఆ కుక్కలకు ఎవరైనా బిస్కిట్లు, అన్నం తినిపించే వారిని వేధించేవాడు. అయితే గత వారం ఓ ఆడ కుక్కతో అఘాయిత్యానికి పాల్పడటాన్ని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి గమనించాడు. దీంతో విషయాన్ని జంతు ప్రేమికులకు చేరవేశారు. థానేలోని వాగ్డే ఎస్టేట్‌లో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుసుకున్న వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆడకుక్కపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.