విద్యుత్ బిల్లు షాకులు.. పూరీ గుడిసెకు రూ.17వేలు, రేకుల షెడ్డుకు రూ.28వేలు..!

ఏపీలోని ప్రజలకు విద్యుత్ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి. గత నెలలో కరెంట్ బిల్లులు రాకపోగా.. ఈ నెల వచ్చిన బిల్లులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

విద్యుత్ బిల్లు షాకులు.. పూరీ గుడిసెకు రూ.17వేలు, రేకుల షెడ్డుకు రూ.28వేలు..!
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 2:26 PM

ఏపీలోని ప్రజలకు విద్యుత్ బిల్లులు షాక్‌ ఇస్తున్నాయి. గత నెలలో కరెంట్ బిల్లులు రాకపోగా.. ఈ నెల వచ్చిన బిల్లులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో నివసిస్తున్న కుటుంబానికి రూ.17వేల కరెంట్ బిల్లు వచ్చింది. అక్కడే మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉన్న కుటుంబానికి రూ.28వేల విద్యుత్ బిల్లు వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు షాక్‌కు గురై.. తలలు పట్టుకుంటున్నారు. ప్రతి ఏడాది వేసవిలో వందల్లోనే బిల్లులు వచ్చేవని.. కానీ ఈ సారి మాత్రం భారీగా ఛార్జీలు వచ్చాయని వారు వాపోతున్నారు.

మరోవైపు మీటర్ రీడింగ్ సేకరణ, బిల్లుల తయారీలో ఎలాంటి లోపాలు లేవని, వినియోగించిన దానికి మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగినా.. అధికంగా ఒక్క యూనిట్‌కు కూడా బిల్లు వేయలేదని వారు అంటున్నారు. ఒకవేళ అనుమానం ఉంటే ఆన్‌లైన్‌లో సరి చేసుకోవచ్చునని.. బిల్లులో ఏదైనా వ్యత్యాసం ఉంటే తమకు సమాచారం ఇవ్వొచ్చని అధికారులు మాట్లాడుతున్నారు.

Read This Story Also: క‌రోనా ఊర‌టః వైర‌స్‌ని పసిగట్టగలిగే మాస్కులు