Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

అతని మెదడులో 700 పురుగులు.. ఆ మాంసం తిన్నందుకే…

Lungs and Chest after Consuming Uncooked Meat, అతని మెదడులో 700 పురుగులు.. ఆ మాంసం తిన్నందుకే…

ఉడికీ ఉడకని మాంసం తింటున్నారా.? టేస్ట్ బావుందని అదే పనిగా ఆ మాంసం కుమ్మేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ వార్త.. మీకు తరచూ తలనొప్పితో బాధపడుతూ.. ఎంతకు ఆ తలనొప్పి గనక తగ్గకపోతే, ఏం కాదులే అంటూ లైట్ తీసుకోకండి. వెంటనే సమీపంలోని వైద్యుల్ని సంప్రదించండి. ఎందుకంటే అది ప్రమాదకరమైన ‘టైనియాసిస్’ వ్యాధి అయి ఉండచ్చు.

చైనాలో ఓ వ్యక్తి ఇలాగే విపరీతమైన తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్లాడు. సాధారణ తలనొప్పిగానే భావించిన వైద్యులు.. కొన్ని మందులు ఇచ్చి పంపించేశారు. అయినప్పటికీ, తలనొప్పి తగ్గకపోవడంతో ఈ సారి బ్రెయిన్ స్కాన్ చేశారు. అయితే స్కానింగ్ అనంతరం వచ్చిన రిపోర్టులను చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. అతని మెదడులో టేప్ వార్మ్స్ పురుగులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. మెదడుతో పాటు ఊపిరితిత్తులు, ఛాతీ భాగంలో కూడా వందల సంఖ్యలో ఈ పురుగుల్ని గుర్తించారు. మొత్తం 700కి పైగా ఈ టేప్‌వార్మ్స్ పురుగులు.. అతడి అవయవాలను చుట్టేసినట్లు వైద్యులు తెలిపారు.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ప్రాణాంతక వ్యాధి సోకింది. దీన్నే ‘టైనియాసిస్’ అని పిలుస్తారు. నెల రోజుల కింద.. ఎప్పుడో ఉడకని పంది మాంసం తినడం వల్ల ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు చెబుతున్నారు. మాంసాన్ని సరిగ్గా ఉడికించకపోవడం వల్ల ఆ జంతువు శరీరంలో ఉండే టేప్‌వార్మ్ గుడ్లు బ్రతికే ఉంటాయని.. ఆ మాంసాన్ని మనం తిన్నప్పుడు టేప్ వార్మ్ గుడ్లు మన శరీరంలోకి చేరడంతో ఇలాంటి వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే, ఏ నాన్ వెజ్ ఫుడ్‌ అయినా..సరిగ్గా ఉడకనివ్వాలని, అప్పుడే అందులోని క్రిమికీటకాలు ఏమైనా ఉంటే చనిపోతాయని అంటున్నారు. లేనిపక్షంలో ఇలాంటి వ్యాధులకు గురవ్వాల్సిందేనని చెబుతున్నారు. సో.. మరి మీరు కూడా నాన్ వెజ్ తినేటప్పుడు అది సరిగ్గా ఉడికిందా లేదా అని చూడకుండా లాగించేస్తే.. ఇలాంటి ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.