ఏపీ మంత్రి అనిల్ కుమార్ సమక్షంలో…

Man falls into Krishna river while taking selfie at Prakasam barrage, ఏపీ మంత్రి అనిల్ కుమార్ సమక్షంలో…

విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదికి వరదలు రావడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఐదు గేట్లను ఐదు అడుగుల ఎత్తు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, మరికొందరు వైసీపీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడు సెల్ఫీ తీసుకుంటూ పట్టుతప్పి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడు తనను కాపాడాలంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యాయి. వరద ప్రవాహం ఉండడంతో అతడు కొట్టుకుపోయాడు. వెంటనే మత్స్యకారులు బోటులో వెళ్లి అతడిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికి అతడు కొన ఊపిరితో ఉన్నాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అతడికి సీపీఆర్ (నోటిలోకి గాలిని నేరుగా ఊది, గుండె మీద కొట్టే పద్ధతి) ఇచ్చారు. కానీ, ప్రాణం దక్కలేదు. ఒడ్డుకు చేర్చిన కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *