ఓ బిస్కెట్ ప్యాకెట్..కోతి..నిండు ప్రాణం!

Man Died Due to Electric Shock at Anantapur, ఓ బిస్కెట్ ప్యాకెట్..కోతి..నిండు ప్రాణం!

ఓ కోతి చేసిన పని ఓ యువకుడి నిండు ప్రాణాన్ని తీసింది. తాను నిర్వహిస్తున్న షాప్‌లోని బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన వానరం  వెంటపడి ఓ యువకుడు అనూహ్యంగా విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందాడు. అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..ముదిగుబ్బలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు(25) చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈయన దుకాణంలోకి చొరబడిన ఓ కోతి బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి సమీపంలోని రేకులషెడ్డు పైకి చేరుకుంది. దాన్ని అక్కడినుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో.. షెడ్డుపైకి ఎక్కిన రాజుకు పైనున్న 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ విద్యత్ తీగలకు అతుక్కుపోయి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసిన రాజు తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Man Died Due to Electric Shock at Anantapur, ఓ బిస్కెట్ ప్యాకెట్..కోతి..నిండు ప్రాణం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *